
దేశంలో ప్రస్తుతం ఓటీటీల హావా నడుస్తోంది. కరోనా కారణంగా థియేటర్లు అన్ని మూతపడడంతో ఓటీటీలకు ప్రేక్షకుల ఆధరణ పెరిగిపోయింది. దీంతో ప్రముఖ సెలబ్రెటీలు సైతం ఓటీటీ వైపు అడుగులువేస్తున్నారు. అంతే కాకుండా పలువురు స్టార్ హీరోల సైతం ఇందులో విడుదలయ్యాయి. ఇక తమిళ హీరో కార్తీ నూతన సినిమా కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల థియేటర్లు ఓపెన్ చేసిన కానీ ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. అటు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా వంటి ఓటీటీలు భారీ స్థాయిలో సినిమాలను కొనుగోలు చేయడానికి వెనకడడం లేదు. తాజాగా వీటి జాబితాలోకి మరో ఓటీటీ యాప్ రాబోతుంది. టాలీవుడ్ సక్సెస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దీనిని లాంచ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. న్యూ ఇయర్ కానుకగా ఈ యాప్ ను లాంచ్ చేయనున్నారట. ఇక రాబోయే ఈ కొత్త ఓటీటీ యాప్‌కు ఊర్వశీ అనే పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం వి.వి. వినాయక్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చి ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడని సమాచారం.