F3 Movie Update: ‘ఎఫ్ 3″ సినిమా రూమర్లపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. ఆ ఆలోచన కూడా తనకు లేదంటూ..

|

Jan 26, 2021 | 11:18 AM

డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన కామెడి ఎంటర్ టైనర్ 'ఎఫ్ 2' బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో విక్టరీ

F3 Movie Update: ఎఫ్ 3 సినిమా రూమర్లపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. ఆ ఆలోచన కూడా తనకు లేదంటూ..
Follow us on

డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన కామెడి ఎంటర్ టైనర్ ‘ఎఫ్ 2’ బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహారీన్‏లో హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాకు సిక్వెల్ ‘ఎఫ్ 3’ మూవీని రూపొందించనున్నట్లుగా గతంలో ప్రకటించాడు. ఇక ఇటివలే విడుదలైన ఈ మూవీ పోస్టర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో మరో హీరో కూడా నటించబోతున్నట్లుగా కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఇందులో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించనున్నట్లుగా రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

గతేడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాను తెరకెక్కించాడు అనిల్. ఆ సినిమా బ్లాక్ బస్టర్‏ కొట్టడమే కాకుండా.. అనిల్ రావిపూడ్ టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఇక ప్రస్తుతం అనిల్ ఎఫ్ 3 మూవీ చిత్రీకరణలో ఉన్నాడు. ఇదిలా ఉండగా.. ఎఫ్ 3 సినిమాలో మూడో హీరోగా ఎవరు చేయడం లేదని.. అసలు తనకు ఆ మూడో హీరో అన్న ఆలోచన కూడా లేదని చెప్పుకొచ్చాడు. ఇక ఎఫ్ 2 లాగే ఎఫ్ 3 కూడా ఇద్దరు హీరోలతో మాత్రమే చిత్రీకరిస్తానని తెలిపాడు. అటు ఎఫ్ 3 సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read:

Nandamuri Balakrishna : బాలయ్య సినిమా అందుకే ఆలస్యం అవుతుందట.. బిబి3 పై కొత్త గాసిప్..