
తెలుగులో ‘బిగ్ బాస్’ రెండు సీజన్లు హిట్ కావడంతో త్వరలో మూడో సీజన్ ప్రారంభించేందుకు షో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ షో జూలై మొదటి వారంలో మొదలుకానున్నట్లు సమాచారం. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. అయితే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ షో ప్రారంభ తేదీని కొద్దిరోజుల్లో ప్రకటించనున్నారు.
ఇది ఇలా ఉండగా ప్రముఖ యాంకర్ లాస్య ‘బిగ్ బాస్ 3’ ద్వారా మరోసారి బుల్లితెరలోకి అడుగుపెట్టనుంది. పెళ్లి తర్వాత బుల్లితెరకు దూరంగా ఉన్న లాస్య.. ఈ షో ద్వారా తన రీ-ఎంట్రీని ఖరారు చేసింది.