ఎంత ఒదిగితే..అంత ఎదిగినట్టు

|

Apr 20, 2019 | 7:39 AM

బయటికి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా మనది పురుషాధిక్య ప్రపంచం. ఇల్లాలు వంట గది దాటితే..అదేదో యుగాంతం వచ్చినట్టు ఫీల్ అవుతారు చాలా మంది మగాళ్లు. ఆళిపై అంతుచిక్కని డామినేషన్‌ను చూపిస్తూ చెలరేగిపోతుంటారు . నిజం చెప్పాలంటే గొప్ప మగాళ్లు ఉండొచ్చు…ఆడాళ్లను మించిన గొప్ప మగాళ్లు ఉండరు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే… బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కు గతేడాది ఆనంద్ అహుజా అనే వ్యాపారవేత్తతో వివాహం జరిగింది.  ఆనంద్ అహుజాకు సోనమ్ అంటే ప్రాణం. […]

ఎంత ఒదిగితే..అంత ఎదిగినట్టు
Follow us on

బయటికి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా మనది పురుషాధిక్య ప్రపంచం. ఇల్లాలు వంట గది దాటితే..అదేదో యుగాంతం వచ్చినట్టు ఫీల్ అవుతారు చాలా మంది మగాళ్లు. ఆళిపై అంతుచిక్కని డామినేషన్‌ను చూపిస్తూ చెలరేగిపోతుంటారు . నిజం చెప్పాలంటే గొప్ప మగాళ్లు ఉండొచ్చు…ఆడాళ్లను మించిన గొప్ప మగాళ్లు ఉండరు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే… బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కు గతేడాది ఆనంద్ అహుజా అనే వ్యాపారవేత్తతో వివాహం జరిగింది.  ఆనంద్ అహుజాకు సోనమ్ అంటే ప్రాణం. ఆమె కోసం ఏదైనా చేస్తాడు. ఎంత ప్రేమ వివాహం అయినప్పటికీ పెళ్లి తరువాత ఆ ప్రేమలో కొన్ని మార్పులు కనిపిస్తుంటాయ్.  కానీ, అహుజా ప్రేమలో మార్పు రాలేదు కదా ఇంకా పెరిగింది.  రీసెంట్ గా ఈ జంట ఓ ఓపెనింగ్ వేడుకకు హాజరయ్యారు.  అనుకోకుండా సోనమ్ కపూర్ షూ లేస్ ఊడిపోయింది.  అది గమనించిన ఆనంద్ అహుజా ఏ మాత్రం సంకోచించకుండా ఆమె షూ లేస్‌ను కట్టాడు.  ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఈ క్రేజీ కపుల్ లవ్ అండ్ కేరింగ్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.