Republic Day 2022: వినూత్నంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన బిగ్ బీ.. నెట్టింట్లో వైరల్ గా మారిన పోస్ట్..

|

Jan 26, 2022 | 12:48 PM

Amitabh Bachchan: దేశవ్యాప్తంగా ఇవాళ 73వ గణతంత్ర దినోత్సవాన్ని(Republic Day) జరుపుకుంటోంది. రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు జెండా వందనం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు

Republic Day 2022: వినూత్నంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన బిగ్ బీ.. నెట్టింట్లో వైరల్ గా మారిన పోస్ట్..
Amitabh Bachchan
Follow us on

Amitabh Bachchan: దేశవ్యాప్తంగా ఇవాళ 73వ గణతంత్ర దినోత్సవాన్ని(Republic Day) జరుపుకుంటోంది. రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు జెండా వందనం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలకు రిపబ్లిక్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఇన్ స్టాగ్రామ్ ద్వారా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అందులో బిగ్ బీ తన గడ్డాన్ని మన దేశ జాతీయ పతాకంలో మాదిరిగా మూడు రంగులతో (Tricolours) అలంకరించుకున్నాడు.  దీనిని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్న అమితాబ్ ‘ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా’ అని రాసుకొచ్చారు

త్రివర్ణ గడ్డంతో..

కాగా ఇది పాత ఫొటో అయినా అందరినీ ఆకట్టుకుంటోంది.  సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు వరుస కామెంట్లు పెడుతూ బిగ్ బీపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. బిగ్ బీ కూతురు శ్వేతా నందా,  కపిల్ శర్మ ‘స్మైలీ ఎమోజీలతో కామెంట్ పెట్టగా మరో నటి  దివ్యదత్తా .. ‘సార్! గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఎంతో బాగా చెప్పారు. హ్యాపీ రిపబ్లిక్ డే’ అంటూ రాసుకొచ్చింది.

Also read: Coronavirus: రెండోసారి కరోనా బారిన పడిన యానీ మాస్టర్.. క్వారంటైన్ కష్టంగా ఉందంటూ పోస్ట్..

Ravi Teja Birthday: యాక్షన్ మోడ్ లో రామారావు.. ఆకట్టుకుంటోన్న మాస్ మహారాజా బర్త్ డే పోస్టర్..

Ananya Panday: చలికి తట్టుకోలేకపోయిన ‘లైగర్’ బ్యూటీ.. యంగ్ హీరో చేసిన పనికి నెటిజన్లు ఫిదా..