
ఏ ముహూర్తాన టాలీవుడ్‌లో అడుగుపెట్టిందో కానీ వరుసగా విజయాలు సొంతం చేసుకుంటోంది కన్నడ బ్యూటీ రష్మిక మందాన (Rashmika Mandanna). ‘ఛలో’ అంటూ తెలుగులో తన సినిమా ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించిన ఈ అందాల తార ‘గీతగోవిందం’, ‘దేవదాస్’, ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ చిత్రాలతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. ఇక పుష్ప (Pushpa) సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. సినిమాల సంగతి పక్కన పెడితే పర్సనల్ లైఫ్ పరంగానూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది రష్మిక. తన డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తోందని, అతనితో త్వరలో పెళ్లిపీటలెక్కుతుందన్న పుకార్లు బాగా షికార్లు చేస్తున్నాయి. వీటిపై తాజాగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతీసారి వార్తల్లో ఇదే చెత్తను చూడాల్సి వస్తోందంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.
అవన్నీ టైం పాస్ అబ్బా!
ఇక ఇప్పటికే తన ప్రేమ, పెళ్లి వార్తలపై స్పందించిన రష్మిక తాజాగా మరోసారి వాటిపై స్పందించింది. ముఖ్యంగా టాలీవుడ్ రౌడీతో వివాహం గురించి సోషల్ మీడియా, వెబ్‌సైట్లలో వస్తున్న వార్తలపై నోరు విప్పింది. ‘ విజయ్ తో పెళ్లి వార్తలు నా దృష్టికి కూడా వచ్చాయి. అవన్నీ టైం పాస్ అబ్బా. ఇలాంటి పుకార్లు నాకేం కొత్తకాదు. వాటిని విని నవ్వుకోవడం అలవాటైపోయింది. ప్రేమించి, పెళ్లి చేసుకునేంత టైం ఇప్పుడు నా దగ్గర లేదు. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాలపైనే’ అంటూ కుండబద్ధలు కొట్టింది. గతంలోనూ రిలేషన్‌షిప్‌పై స్పందించిన రష్మిక ‘నా దృష్టిలో ప్రేమంటే మాటల్లో వర్ణించలేం. అది కేవలం ఫీలింగ్స్‌కు సంబంధించిన విషయం మాత్రమే. రిలేషన్ షిప్‌లో ఒకరికి మరొకరు తగిన సమయం, గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. అప్పుడే మాత్రమే అది ప్రేమగా మారుతుంది. ప్రేమ అనేది రెండువైపులా ఉంటేనే ఆ బంధం ముందుకు వెళుతుంది. ప్రస్తుతానికి నా వయసు చిన్నది. కాబట్టి పెళ్లి గురించి ఏవిధంగా ఆలోచించాలో నాకు తెలియడం లేదు. పెళ్లికి సంబంధించిన ఆలోచనలను కూడా నా మనసులోకి రానీయడంలేదు. నన్ను ఎవరైతే ప్రేమగా, సురక్షితంగా చూసుకుంటారో వారిని పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రంలో శర్వానంద్‌కు జోడీగా నటిస్తోంది రష్మిక. మార్చి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read:Maha Shivratri 2022: ఇషా ఫౌండేషన్‌లో ఘనంగా శివరాత్రి వేడుకులు.. లైవ్ వీడియో మీకోసమే
Evening Snacks: సాయంత్రం స్నాక్స్‌గా ఇవి తింటే సూపర్.. రుచితో పాటు మంచి ఆరోగ్యం..
PM Narendra Modi: ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయిన భారతీయ విద్యార్థి.. సంతాపం ప్రకటించిన పీఎం మోదీ..