సుక్కు కోసం.. కొత్త పాఠాలు నేర్చుకుంటోన్న బన్నీ..?

| Edited By:

Nov 05, 2019 | 2:57 PM

సినిమా కోసం ఎంతటి కష్టాన్నైనా పడే హీరోలలో అల్లు అర్జున్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఈ విషయం ఆయన ప్రతి సినిమాలో అర్థమవుతుంది. ఇంతవరకు అతడు నటించిన ఏ రెండు మూవీల్లోనూ ఒకేలా కనిపించిన దాఖలాలు లేవు. లుక్ పరంగా ప్రతి సినిమాకు బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. అంతేకాదు.. దర్శకులు తన దగ్గర నుంచి ఏదైనా కొత్తదనం కోరుకున్నప్పుడు.. దానిని నేర్చుకునేందుకు కూడా ఉత్సాహాన్ని చూపుతుంటాడు. ఈ క్రమంలో ఇప్పుడు సుకుమార్ మూవీ కోసం […]

సుక్కు కోసం.. కొత్త పాఠాలు నేర్చుకుంటోన్న బన్నీ..?
Follow us on

సినిమా కోసం ఎంతటి కష్టాన్నైనా పడే హీరోలలో అల్లు అర్జున్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఈ విషయం ఆయన ప్రతి సినిమాలో అర్థమవుతుంది. ఇంతవరకు అతడు నటించిన ఏ రెండు మూవీల్లోనూ ఒకేలా కనిపించిన దాఖలాలు లేవు. లుక్ పరంగా ప్రతి సినిమాకు బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. అంతేకాదు.. దర్శకులు తన దగ్గర నుంచి ఏదైనా కొత్తదనం కోరుకున్నప్పుడు.. దానిని నేర్చుకునేందుకు కూడా ఉత్సాహాన్ని చూపుతుంటాడు. ఈ క్రమంలో ఇప్పుడు సుకుమార్ మూవీ కోసం బన్నీ కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండగా.. అందుకోసం రాయలసీమ భాషను నేర్చుకునేందుకు బన్నీ ప్రత్యేకంగా ట్యూటర్‌ను పెట్టుకున్నాడట. ముఖ్యంగా చిత్తూరు జిల్లా యాస మీద పట్టు తెచ్చుకునేందుకు ఆయన పాఠాలను నేర్చుకుంటున్నారట. ముఖ్యంగా ఇక త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ అయిన తరువాత.. బన్నీ, సుకుమార్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆ లోపు కాస్త బ్రేక్ తీసుకోనున్న అల్లు అర్జున్.. లుక్ మీద కూడా కసరత్తులు పెట్టనున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఇదిలా ఉంటే బన్నీ నటిస్తున్న అల వైకుంఠపురంలో చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటించగా.. టబు, జయరామ్, నివేథా పేతురాజ్, సునీల్, నవదీప్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.