బన్నీ ‘కారవాన్’ చూస్తే మతి పోవాల్సిందే!

| Edited By: Pardhasaradhi Peri

Jul 05, 2019 | 9:53 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ షూటింగ్ గ్యాప్‌లో  విశ్రాంతి తీసుకోవడం కోసం ఓ కారవాన్ కొనుగోలు చేశాడు. రూ.3.5 కోట్లతో ఈ లగ్జరీ కారవాన్‌ను కొన్న బన్నీ.. మరో మూడున్నర కోట్లు పెట్టి ముంబైకి చెందిన ఓ ఆటోమోటివ్ డిజైనర్‌తో తనకు అవసరమైనట్టుగా మార్పులు చేయించుకున్నాడట. లెదర్ సీట్లు, భారీ అద్దం, అద్భుతమైన లైటింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్లతో ఈ వానిటీ వాన్ అద్భుతంగా ఉంది. ఈ కారవాన్‌పై అల్లు అర్జున్ సిగ్నేచర్ లోగో AAను బయట వైపు […]

బన్నీ కారవాన్ చూస్తే మతి పోవాల్సిందే!
Follow us on

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ షూటింగ్ గ్యాప్‌లో  విశ్రాంతి తీసుకోవడం కోసం ఓ కారవాన్ కొనుగోలు చేశాడు. రూ.3.5 కోట్లతో ఈ లగ్జరీ కారవాన్‌ను కొన్న బన్నీ.. మరో మూడున్నర కోట్లు పెట్టి ముంబైకి చెందిన ఓ ఆటోమోటివ్ డిజైనర్‌తో తనకు అవసరమైనట్టుగా మార్పులు చేయించుకున్నాడట. లెదర్ సీట్లు, భారీ అద్దం, అద్భుతమైన లైటింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్లతో ఈ వానిటీ వాన్ అద్భుతంగా ఉంది. ఈ కారవాన్‌పై అల్లు అర్జున్ సిగ్నేచర్ లోగో AAను బయట వైపు స్టైలిష్‌గా రాశారు. బన్నీ ఈ కారవాన్‌కు ‘ఫాల్కన్’ అని పేరు పెట్టుకున్నాడు.

ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన బన్నీ.. ‘‘నా జీవితంలో పెద్దది ఏదైనా కొనుగోలు చేసిన ప్రతిసారీ.. నా మనసులో ఓ ఆలోచన మెదులుతుంది. మీ ప్రేమ వల్లే ఇది సాధ్యమైందనుకుంటా. అభిమానుల ప్రేమ బలమైంది. అందుకే నేను ఇవన్నీ కొనుగోలు చేయగలుగుతున్నా. థ్యాంక్యూ ఆల్. ఇదే నా వానిటీ వ్యాన్ ఫాల్కన్’’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.