
టాలీవుడ్‌లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న స్టార్ హీరోలలో ఒకరు అల్లు అర్జున్. ఒక్కో సినిమాలో ఒక్కో విభిన్నమైన స్టైల్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటారు హీరో అల్లు అర్జున్. తాజాగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన 19వ సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేస్తున్నట్లు కొద్దిరోజుల క్రితమే ప్రకటించాడు. అయితే.. ఈ సినిమా యూనిట్ పూజా కార్యక్రమాలు శనివారం పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్, చిత్ర యూనిట్, తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే. గీతా ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Pics from #AA19PoojaCeremony
LIVE ▶️ https://t.co/e3wz4fyktA #AA19PoojaToday@alluarjun #Trivikram @hegdepooja @MusicThaman @haarikahassine @GeethaArts pic.twitter.com/xs374dodku
— BARaju (@baraju_SuperHit) April 13, 2019