AA20:బన్నీ మూవీ టైటిల్‌ ఇదేనా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది.

AA20:బన్నీ మూవీ టైటిల్‌ ఇదేనా..!

Edited By:

Updated on: Apr 07, 2020 | 12:34 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా బుధవారం బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్‌ ఇవ్వబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఆ గిఫ్ట్‌ ఏంటో చెప్పకపోయినప్పటికీ.. ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మూవీ టైటిల్‌కు సంబంధించిన మరో వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ మూవీకి పుష్ప అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇది హీరోయిన్ రష్మిక పాత్ర పేరని కూడా టాక్. మరి ఇందులో నిజమెంతో మరి కొన్ని గంటల్లో తేలనుంది. కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతోన్న ఈ నేపథ్యంలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ మూవీలో అల్లు అర్జున్ రాయలసీమ యాసలో మాట్లాడనున్నారని.. అందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే రష్మిక గిరిజన యువతి పాత్రలో కనిపించనుందని.. విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, రాజ్‌ దీపక్‌ శెట్టిలను కీలక పాత్రల కోసం ఎంపిక చేశారని సమాచారం. ఇక దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈ చిత్రాన్ని కుదిరితే ఈ ఏడాది చివర్లో.. లేకపోతే వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

Read This Story Also: కరోనాతో నిండు గర్భిణి మృతి