డ్రైవర్ కు ఆలియా సర్ ప్రైజ్ గిఫ్ట్..!

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:15 PM

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ మరోసారి వార్తల్లో నిలిచింది. తన దగ్గర పని చేస్తున్న డ్రైవర్, హెల్పర్ కు సాయం చేసి తన మంచి మనసును చాటుకుంది. ఈ నెల 15న ఆలియా భట్ తన పుట్టినరోజు జరుపుకున్నారు. బర్త్ డే కి రెండు రోజులు ముందు ఆమె దగ్గర పని చేస్తున్న డ్రైవర్, హెల్పర్ కు చెరో 25 లక్షల చెక్కును అందించారు. ‘స్టూడెంట్ అఫ్ ది ఇయర్’ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఆలియా […]

డ్రైవర్ కు ఆలియా సర్ ప్రైజ్ గిఫ్ట్..!
Follow us on

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ మరోసారి వార్తల్లో నిలిచింది. తన దగ్గర పని చేస్తున్న డ్రైవర్, హెల్పర్ కు సాయం చేసి తన మంచి మనసును చాటుకుంది. ఈ నెల 15న ఆలియా భట్ తన పుట్టినరోజు జరుపుకున్నారు. బర్త్ డే కి రెండు రోజులు ముందు ఆమె దగ్గర పని చేస్తున్న డ్రైవర్, హెల్పర్ కు చెరో 25 లక్షల చెక్కును అందించారు. ‘స్టూడెంట్ అఫ్ ది ఇయర్’ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఆలియా భట్. అప్పటి నుంచి సునీల్, అన్మోల్ అనే ఇద్దరు యువకులు ఆమె వద్ద డ్రైవర్ గా, హెల్పర్ గా పని చేస్తున్నారు. వారిని ఆలియా తన సొంత మనుషుల్లాగే చూసుకుంటారట. అందుకే వారికంటూ సొంత ఇళ్లు ఉండాలని భావించిన ఆలియా 50 లక్షల చెక్కును అందజేసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అంతేకాదు తన దగ్గర పని చేస్తున్న మేకప్ మేన్, హెయిర్ స్టయిలిస్ట్ లకు కూడా ఏ అవసరం వచ్చినా వెంటనే హెల్ప్ చేస్తుందట ఆలియా భట్.

కాగా ప్రస్తుతం ఆలియా భట్ ‘బ్రహ్మాస్త్రా’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కళంక్’ మరియు ‘సడక్ 2’ చిత్రాలతో బిజీగా ఉంది.  త్వరలోనే సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా కూడా చేయనుంది ఈ చిన్నది.