FAU-G: ‘ఫౌజీ’ సాంగ్‏ని షేర్ చేసిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.. వీడియోగేమ్ విడుదల ఎప్పుడంటే ?

|

Jan 04, 2021 | 3:08 PM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఇన్‏స్టాలో 'FAU-G' వీడియో గేమ్ పరిచయ సాంగ్‏ని షేర్ చేసారు. 'ఫౌజీ గేమ్' ఆర్మీ నేపథ్యంలో ఉండనుంది.

FAU-G: ఫౌజీ సాంగ్‏ని షేర్ చేసిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.. వీడియోగేమ్ విడుదల ఎప్పుడంటే ?
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఇన్‏స్టాలో ‘FAU-G’ వీడియో గేమ్ పరిచయ సాంగ్‏ని షేర్ చేసారు. ‘ఫౌజీ గేమ్’ ఆర్మీ నేపథ్యంలో ఉండనుంది. ఈ మేరకు తన ఇన్‏స్టాలో.. “సమస్య అనేది దేశంలో ఉన్నా, సరిహద్దుల్లో ఉన్నా.. మన భారత సైనికులు ముందుండి పోరాడుతున్నారు. బెరుకు లేకుండా సంయుక్తంగా యుద్దం చేస్తున్నారు. వారి ధైర్యసాహసాలకు నిదర్శనమే ఈ గీతం” అంటూ పేర్కోన్నారు. కాగా ఈ యానిమేషన్ వీడియో గేమ్‏ను జనవరి 26 విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఈ ఫౌజీ వీడియో గేమ్‏ను ప్రసిద్ధ మొబైల్ గేమ్స్ అభివృద్ధి సంస్థ ఎన్‏కోర్ (ncore games) గేమ్స్ రూపొదించింది. భారత్‏లో కేంద్ర ప్రభుత్వం పబ్‏జీ గేమ్‏ని బ్యాన్ చేసినప్పుడు ఈ ఫౌజీ గేమ్ గురించి ప్రకటన వెలువడింది. భారత్ పబ్ జీ గా పిలువబడే ఈ ఫౌజీ గేమ్‏ని నవంబర్ 2020లో లాంచ్ చేశారు.

అక్షయ్ కుమార్ షేర్ చేసిన వీడియో..

Also Read:

KGF-2 Update: కేజీఎఫ్‌ సామ్రాజ్యంలోకి వెళ్లడానికి కౌంట్‌ డౌన్‌ మొదలైంది.. యష్‌ బర్త్‌డే కానుకగా..

రెమ్యునరేషన్ పెంచుకుంటూపోతున్న బాలీవుడ్ స్టార్ హీరో.. ఒక్కొక్క సినిమాకు ఏకంగా 135 కోట్లు !!