AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

ప్రస్తుతం ఓటీటీలో కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. హరర్, థ్రిల్లర్, సస్పెన్స్ ఇలాంటి జానర్ సినిమాలు చూసేందుకు అడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఒక సినిమా ఓటీటీలో ట్రెండింగ్ లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆద్యంతం థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Cinema : థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..
Newtons 3rd Law
Rajitha Chanti
|

Updated on: Sep 02, 2026 | 7:51 AM

Share

అక్కినేని హీరో సుమంత్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’. జూలై చివరి వారంలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని నెల రోజుల్లోపే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ క్రైమ్ థ్రిల్లర్ ప్రియుల దృష్టిని బాగా ఆకట్టుకుంటోంది. భౌతిక శాస్త్రంలో “ప్రతి చర్యకు దానికి సమానమైన, వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది” అనే న్యూటన్ మూడో నియమాన్నే ప్రధాన సూత్రంగా, కర్మ సిద్ధాంతంతో ముడిపెట్టి ఈ చిత్రాన్ని దర్శకుడు రాజేష్ కర్ణ తెరకెక్కించారు.

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

కథ విషయానికి వస్తే.. కథ విషయానికి వస్తే, 1999లో జరిగిన ఒక జంట హత్యల మిస్టరీ ఆధారంగా సినిమా ప్రారంభమవుతుంది. కాలక్రమంలో మరుగున పడిపోయిన ఆ కేసు, ఏళ్ల తర్వాత ఒక పుస్తకం రూపంలో మళ్లీ వెలుగులోకి వస్తుంది. మరోవైపు, వినయ్ (త్రినాథ్ వర్మ) అనే ఇంజనీరింగ్ విద్యార్థి అపార్ట్‌మెంట్ పైనుంచి పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతాడు. పోస్ట్‌మార్టం నివేదికలో అతని తలలో బుల్లెట్ ఉందనే నిజం బయటపడటంతో ఇది పక్కా మర్డర్ అని తేలుతుంది. ఈ మిస్టరీని ఛేదించే బాధ్యతను పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ (సుమంత్) తీసుకుంటారు. దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ అనూహ్య మలుపులు, రహస్యాలు బయటకు వస్తాయి.

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్‌గా సుమంత్ గంభీరమైన, కొలతలతో కూడిన నటనతో సినిమాను ముందుండి నడిపించారు. అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, షెల్లీ ఎన్. కుమార్ , నేహా పఠాన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతికంగా సింజిత్ యర్రమిల్లి నేపథ్య సంగీతం , సినిమాటోగ్రఫీ క్రైమ్ థ్రిల్లర్ మూడ్‌ను చక్కగా సెట్ చేశాయి. థియేటర్లలో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, ఓటీటీలో మాత్రం కంటెంట్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓటీటీ వేదికలపై మంచి రేటింగ్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తూ డిజిటల్ ప్రేక్షకులకు ఒక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా నిలిచింది. మిస్టరీ, సస్పెన్స్, ఊహించని ట్విస్టులు ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక గుడ్ డిజిటల్ వాచ్ అనే చెప్పాలి.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..

ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..

Follow Us
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..