AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

సెప్టెంబర్ 2, 2026 బుధవారం 12 రాశుల దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం నుంచి మీనం వరకు ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం, ఆరోగ్యం, పెళ్లి, ధనలాభం వంటి అంశాల్లో ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో రాశుల వారీగా తెలుసుకోండి.

Horoscope Today: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
Daily Horoscope Today
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 02, 2026 | 7:10 AM

Share

దిన ఫలాలు ( సెప్టెంబర్ 2, 2026) మేషం రాశి వారికి గురు, రాహువుల అనుకూలతతో పాటు పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆర్థికాభివృద్ధికి అవకాశాలు పెరిగే సూచనలున్నాయి. వృషభం రాశి వారికి రాశ్యధిపతి శుక్రుడు పంచమ స్థానంలో, రవి, బుధులు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల రోజంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోవడంతో పాటు వృత్తి, ఉద్యోగాల్లో కూడా సానుకూల పరిస్థితులుంటాయి. మిథునం రాశివారికి గురువు ధన స్థానంలో, శనీశ్వరుడు దశమ స్థానంలో అనుకూల సంచారం చేయడం ఈ రాశివారికి అనేక దోషాలను, సమస్యలను తొలగిస్తుంది. మేషం మొదలుకుని.. మీనం వరకు 12 రాశుల వారికి దినఫలాలు బుధవారం ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):

గురు, రాహువుల అనుకూలతతో పాటు పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆర్థికాభివృద్ధికి అవకాశాలు పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ జీవితం సానుకూలంగా సాగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో క్రియాశీలంగా వ్యవహరించి పేరు తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):

రాశ్యధిపతి శుక్రుడు పంచమ స్థానంలో, రవి, బుధులు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల రోజంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోవడంతో పాటు వృత్తి, ఉద్యోగాల్లో కూడా సాను కూల పరిస్థితులుంటాయి. అధికారులు ఎంతో నమ్మకంతో బరువు బాధ్యతలు పెంచడం జరుగు తుంది. ఆర్థిక పరిస్థితికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. బంధుమిత్రులకు వీలైనంతగా సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. షేర్ల వ్యాపారంలో బాగా లాభపడతారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):

ఈ రాశికి గురువు ధన స్థానంలో, శనీశ్వరుడు దశమ స్థానంలో అనుకూల సంచారం చేయడం ఈ రాశివారికి అనేక దోషాలను, సమస్యలను తొలగిస్తుంది. ఆదాయం కలిసి రావడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉండడం, మనసులోని కోరికలు నెరవేరడం, ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందడం వంటివి చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకా ఉండదు. కుటుంబ జీవితం మరింత మెరుగ్గా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):

ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితి, ధన స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల ఆదాయ వృద్ధి సంబం ధమైన ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎదురు చూస్తున్న శుభవార్త అందుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):

ఈ రాశిలో రవి, బుధులు, లాభ స్థానంలో కుజుడి సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాఫీగా సాగిపోతాయి. సమాజంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. మీ సలహాలు, సూచనలకు అధికారులు విలువనిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహకారం ఉంటుంది. మిత్రులకు అండగా ఉంటారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):

దశమ స్థానంలో కుజుడు, లాభ స్థానంలో గురువు ఉచ్ఛస్థితి వల్ల రోజంతా సాఫీగా, హ్యాపీగా సాగి పోయే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. ఆలయాలు సందర్శించడం గానీ, విహార యాత్రకు వెళ్లడం గానీ జరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆరోగ్యం, ఆదాయం బాగానే ఉంటాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):

మూడు శుభ గ్రహాలతో పాటు శని కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తల పెట్టినా సఫలమవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా పురోగతి చెందు తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది కానీ వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. దాంపత్య జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవా లేదు. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట):

రవి, బుధ, శుక్ర అనుకూల స్థానాల్లో ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగానికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనవ సర ఖర్చులు, స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):

రవి, శుక్ర, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కెరీర్ పరంగా అనేక లాభాలు కలుగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొందరు మిత్రులు ఆర్థికంగా నష్టపరిచే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):

శుక్ర, గురు, శని గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యు లేషన్లు లాభిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఇతరులకు ఆర్థిక సహాయం చేసి ఇబ్బందుల్లో పడతారు. అనుకోకుండా ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశముంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):

ఈ రాశికి సప్తమ స్థానంలో బుధాదిత్యయోగం ఏర్పడడం వల్ల కొన్ని శుభ వార్తలు అందే అవకా శముంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరి ష్కారమవుతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు ఉండవచ్చు. ఆర్థికంగా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. బంధుమిత్రుల్లో కొందరు అపనిందలు వేసే సూచనలున్నాయి. ఆర్థిక సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):

రాశ్యధిపతి గురువు పంచమంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, షష్ట స్థానంలో రవి సంచారం వల్ల వ్యక్తి గత జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్న శుభ వార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయం, రాబడి పెరుగుతాయి. ఏలిన్నాటి శని ప్రభావం వల్ల వృథా ఖర్చులు, స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు.

Follow Us