Most Eligible Bachelor : అఖిల్ సినిమాకు కొత్త చిక్కులు.. స్టోరీలో మార్పులు చేయబోతున్న దర్శకుడు.?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా నిలబడటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో నటించాడు.

Most Eligible Bachelor : అఖిల్ సినిమాకు కొత్త చిక్కులు.. స్టోరీలో మార్పులు చేయబోతున్న దర్శకుడు.?

Edited By:

Updated on: Jan 27, 2021 | 5:48 PM

Most Eligible Bachelor : అక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా నిలబడటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో నటించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత విక్రమ్ కుమార్ కే దర్శకత్వంలో ‘హలో’అనే లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ సినిమా కుడా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో’మిస్టర్ మజ్ను’సినిమా చేశాడు. భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కుడా బాక్సాఫీస్ దగ్గర బోల్తకోట్టింది.

దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు’మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను బొమ్మరిల్లు బాస్కర్ తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్ఫణలో జీఏ2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ సినిమాకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడిందని తెలుస్తుంది. మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఆర్ కె నాయుడు (సాగర్ ) షాదీ ముబారక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కథ అఖిల్ సినిమా కథ ఒకే లా ఉందట. దాంతో అఖిల్ సినిమాలో మార్పులు చేస్తున్నారని ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది.  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సెకండ్ ఆఫ్ లో చాలా వరకు చేంజెస్ చేస్తున్నాడట దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. మార్పులు చేసి కొత్తగా స్క్రిప్ట్ రాసి రీషూట్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ , ఒక పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Hero Sandeep kishan: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా షూటింగ్ షూరు చేసిన సందీప్ కిషన్..