‘అఖిల్ 4’కు ముహూర్తం ఫిక్స్..?

|

Apr 20, 2019 | 10:00 PM

‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అక్కినేని అఖిల్ కు ఇప్పటివరకు సరైన హిట్ దక్కలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘మిస్టర్ మజ్ను’ సినిమా కూడా ఆయనకు నిరాశే మిగిల్చింది. ఇక ఈ సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న అఖిల్ తన కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. కాగా ఈ చిత్రం మే రెండవ వారం నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. పూర్తి ఫ్యామిలీ […]

అఖిల్ 4కు ముహూర్తం ఫిక్స్..?
Follow us on

‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అక్కినేని అఖిల్ కు ఇప్పటివరకు సరైన హిట్ దక్కలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘మిస్టర్ మజ్ను’ సినిమా కూడా ఆయనకు నిరాశే మిగిల్చింది. ఇక ఈ సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న అఖిల్ తన కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. కాగా ఈ చిత్రం మే రెండవ వారం నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.

పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కియరా అద్వానీ ని హీరోయిన్ గా ఎంపిక చేయాలని చూస్తున్నారట. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు.