AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దస‌రా కానుకగా అజయ్ దేవగన్ ‘మైదాన్’ మూవీ… అక్టోబ‌ర్15, 2021న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల…

భారత ఫుట్ బాల్ ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`.

దస‌రా కానుకగా అజయ్ దేవగన్ ‘మైదాన్’ మూవీ... అక్టోబ‌ర్15, 2021న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల...
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 13, 2020 | 6:18 PM

Share

భారత ఫుట్ బాల్ ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`. బధాయి హో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఫుట్‌బాల్‌కి స్వ‌ర్ణ‌యుగ‌మైన 1952-62 మ‌ధ్య కాలానికి సంబంధించిన క‌థ‌తో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే చిత్ర బృందం విడుదల చేసిన మైదాన్ పోస్టర్స్ ఆడియ‌న్స్‌ని విశేషంగా ఆకట్టుకున్న విష‌యం తెలిసిందే.

తాజాగా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15, 2021న `మైదాన్` చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ – “ ఇప్ప‌టి వ‌ర‌కూ తెర‌పై చూడ‌ని ఒక స్పూర్తివంత‌మైన క‌థ‌తో ప్రతి భారతీయుడు గర్వపడేలా మైదాన్ చిత్రం ఉంటుంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15, 2021న మైదాన్ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం“ అన్నారు.

నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, బధాయి హో ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న మైదాన్ ని ఫ్రెష్‌లైమ్ ఫిల్మ్‌ సహకారంతో జీ స్టూడియోస్ బేన‌ర్‌పై బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్