Breaking: కరోనా నుంచి కోలుకున్న ఐశ్వర్య, ఆరాధ్య

ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ కరోనా నుంచి కోలుకున్నారు. టెస్ట్‌లో నెగిటివ్ రావడంతో వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయన్ని అభిషేక్ బచ్చన్‌ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.

Breaking: కరోనా నుంచి కోలుకున్న ఐశ్వర్య, ఆరాధ్య

Updated on: Jul 27, 2020 | 4:43 PM

Aishwarya and Aaradhya tests negative:ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ కరోనా నుంచి కోలుకున్నారు. టెస్ట్‌లో నెగిటివ్ రావడంతో వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయన్ని అభిషేక్ బచ్చన్‌ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.

మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఐశ్వర్య, ఆరాధ్యకు టెస్ట్‌ల్లో నెగిటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వారు ఇంట్లో ఉన్నారు. నేను, నాన్న ఇంకా వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాము అని అభిషేక్ ట్వీట్ చేశారు.

కాగా కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఈ నెల 12న అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్ బచ్చన్ ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత ఐశ్వర్య, ఆరాధ్యకు పాజిటివ్‌గా తేలగా.. వారు కొద్ది రోజుల పాటు హోమ్‌ ఐసోలేషన్‌లో గడిపారు. అయితే ఆ తరువాత లక్షణాలు ఎక్కువవుతుండటంతో ఆసుపత్రిలో చేరి, తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే ఐసోలేషన్ వార్డులో ఒంటరిగా ఉండటం వలన మానస్థిక స్థితి మీద ప్రభావం చూపుతుందంటూ ఇటీవల బిగ్‌బీ తన బ్లాగ్‌లో రాసుకొచ్చిన విషయం తెలిసిందే.

Read This Story Also: బిగ్‌బాస్‌ 4 అప్‌డేట్‌‌: 10 వారాలు.. 13 మంది కంటెస్టెంట్‌లు..!

 

Loading...
Unable to load recommendations.
Follow Us