తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న అన్‌స్టాపబుల్ టాక్‌షోకు వస్తోన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ టాక్‌షో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. తొలి సీజన్ విజయవంతంగా పూర్తి కావడంతో సీజన్-2ని ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. సీజన్ 2ని చంద్రబాబు నాయుడితో నిర్వహించి షోపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. అంచనాలకు అనుగుణంగానే ఈ షో అందరినీ ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా ప్రేక్షకులకు మరో సర్‌ప్రైజ్‌ను ఇస్తోంది. అన్‌సెన్సార్డ్ పేరుతో ఎపిసోడ్‌ను టెలికాస్ట్ చేయనుంది. గురువారం అర్థరాత్రి నుంచి ఆహాలో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన ఆహా..’మనకి తెలియని మరిన్ని రహస్యాలు, మనం వినని మరెన్నో విశేషాలు.. ఎన్‌బీకే అన్‌సెన్సార్డ్ వెర్షన్ ఎపిసోడ్‌లో’ అంటూ రాసుకొచ్చారు. అలాగే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను సైతం విడుదల చేశారు.
Manaki theliyani marinni rahasyaalu, manam vinani marenno viseshalatho uncensored version of NBK X CBN episode!
Premieres tonight at 12am.
▶️ https://t.co/Fksun3nL2s #MansionHouse @tnldoublehorse @realmeIndia @Fun88India #ChandaBrothers @sprite_india @BigCMobilesIND pic.twitter.com/Gl5QHvzoov— ahavideoin (@ahavideoIN) October 27, 2022
మేకర్స్ చెప్పినట్లుగానే ఈ ప్రోమోలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న వైఫల్యాలతో పాటు సరదా సన్నివేశాలను పంచుకున్నారు. ఒకానొక సమయంలో రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలనుకున్నాను అని చంద్రబాబు చెప్పడం షోపై మరింత ఆసక్తిని పెంచేసింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీపై కోపంతో పనిచేశారు, హైదరాబాద్‌లో ఫార్ములా వన్ రేస్ తీసుకురావాలనుకున్న ఆలోచన.. ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలను చంద్రబాబు పంచుకున్నారు. మరి చంద్రబాబు, బాలయ్యల మధ్య జరిగిన ఈ ఆసక్తికర సంబాషణ పూర్తిగా తెలియాలంటే ఈ అన్‌సెన్సార్డ్ ఎపిసోడ్‌ను చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..