‘హిట్’ సీక్వెల్‌.. ఈ సారి విశ్వక్‌సేన్ కాదు.. ఆ యువ నటుడు కన్ఫర్మ్ అయ్యారా..!

ఈ ఏడాది విడుదలై మంచి టాక్‌ని తెచ్చుకున్న చిత్రాల్లో హిట్ ఒకటి. విశ్వక్‌సేన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.

హిట్ సీక్వెల్‌.. ఈ సారి విశ్వక్‌సేన్ కాదు.. ఆ యువ నటుడు కన్ఫర్మ్ అయ్యారా..!

Edited By:

Updated on: Nov 29, 2020 | 2:55 PM

Hit Movie Sequel: ఈ ఏడాది విడుదలై మంచి టాక్‌ని తెచ్చుకున్న చిత్రాల్లో హిట్ ఒకటి. విశ్వక్‌సేన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాచురల్ స్టార్ నాని, ప్రశాంత్ తిపిర్నేని నిర్మించిన ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఇక ఈ మూవీని హిందీలో కూడా రీమేక్‌ చేస్తున్నారు. కాగా ఈ మూవీ విడుదలైనప్పుడే దీనికి సీక్వెల్‌ని ప్రకటించారు దర్శకుడు.

ఇక ఇందులో హీరోగా విశ్వక్‌సేన్‌ కాకుండా అడివి శేషు నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అతడితో సంప్రదింపులు జరపడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్‌. ఇక మొదటి భాగాన్ని నిర్మించిన నానినే.. సీక్వెల్‌ని కూడా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.