Goodachari: ‘గూఢచారి-2’ని గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నారుగా.. బడ్జెట్‌ ఎంతో తెలుసా.?

|

Aug 30, 2024 | 8:46 AM

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. గూఢచారి-2 పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘గూఢచారి 1’ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన వినయ్‌కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గూఢచారి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సహజంగా సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి...

Goodachari: గూఢచారి-2ని గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నారుగా.. బడ్జెట్‌ ఎంతో తెలుసా.?
Goodachari 2
Follow us on

క్షణం సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అడివిశేషు.. గూడఛారితో ఒక్కసారిగా బడా హీరోగా మారాడు. ఆ తర్వాత ఎవరు, మేజర్‌, హిట్ వంటి చిత్రాలతో నెమ్మదిగా అగ్ర హీరోల్లో ఒకరిగా ఎదిగాడు. అడివి శేషు కెరీర్‌ను మలుపు తిప్పిని చిత్రం గూడఛారి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2018లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లను రాబట్టింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. గూఢచారి-2 పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘గూఢచారి 1’ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన వినయ్‌కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గూఢచారి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సహజంగా సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలను అందుకునేందుకు మేకర్స్‌ సైతం సన్నాహాలు చేస్తున్నారు.

పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను మేకర్స్‌ తెరకెక్కిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్‌ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది పాన్‌ ఇండియా మార్కెట్‌కు కలిసొస్తుందని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో బనితా సంధు హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా బడ్జెట్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాను దాదాపు రూ. 100 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మేకింగ్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకూడదనే ఉద్దేశంతోనే ఇంత బడ్జెట్‌ కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉండనున్నాయి. ఇందులో భాగంగానే యాక్షన్‌ సన్నివేశాలను ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌, పోలాండ్, ఇటలీ వంటి దేశాల్లో షూట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి గూఢచారి 2 బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..