హైదరాబాద్: ‘చెలియా’, ‘నవాబ్’ సినిమాలతో సౌత్‌లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి.. తెలుగు ప్రేక్షకులకు ‘సమ్మోహనం’ సినిమాతో మరింత దగ్గరైంది. ప్రస్తుతం నాని 25వ చిత్రం ‘వి’లో నటిస్తున్న ఈ భామ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్‌లో మాస్ మహారాజ‌్ రవితేజ హీరోగా తెరకెక్కనున్న ‘మహాసముద్రం’ సినిమాలో హీరోయిన్‌గా అదితి రావు హైదరిని ఎంపిక చేశారని సమాచారం. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.