రూమర్స్‌కు చెక్ పెట్టిన అడవి శేష్

అడవి శేష్…నిజం చెప్పాలంటే ఈ యాక్టర్ కమ్ రైటర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికిన బంగారం. చిన్న, చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ చేసిన శేష్..కెరీర్ స్టార్టింగ్‌లోనే మెగాఫోన్ పట్టి కర్మ, కిస్ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. అవి ఫ్లాపైనా పట్టవదలని విక్రమార్కుడిలా పోరాడి క్షణం, గూఢచారి లాంటి సినిమాలతో టాలీవుడ్ స్థాయిని మరో మెట్టు ఎక్కించాడు. తాజాగా గూఢచారి-2 ఫ్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న అడవి శేష్‌కు ఒక రూమర్ తెగ టెన్షన్ పెట్టింది. హీరో […]

రూమర్స్‌కు చెక్ పెట్టిన అడవి శేష్

Updated on: Feb 20, 2019 | 11:56 AM

అడవి శేష్…నిజం చెప్పాలంటే ఈ యాక్టర్ కమ్ రైటర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికిన బంగారం. చిన్న, చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ చేసిన శేష్..కెరీర్ స్టార్టింగ్‌లోనే మెగాఫోన్ పట్టి కర్మ, కిస్ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. అవి ఫ్లాపైనా పట్టవదలని విక్రమార్కుడిలా పోరాడి క్షణం, గూఢచారి లాంటి సినిమాలతో టాలీవుడ్ స్థాయిని మరో మెట్టు ఎక్కించాడు. తాజాగా గూఢచారి-2 ఫ్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న అడవి శేష్‌కు ఒక రూమర్ తెగ టెన్షన్ పెట్టింది.

హీరో నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డను అడవి శేష్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి మూవీలో పవర్ స్టార్ పక్కన హీరోయిన్‌గా నటించిన సుప్రియ…మళ్లీ సిల్వర్ స్రీన్‌పై కనిపించలేదు. తాజాగా అడవి శేష్ రచనా సహకారం అందించి హీరోగా చేసిన గూఢచారి చిత్రంలో ఓ ‘కీ’ రోల్ పోషించింది. అయితే తాజా రూమర్స్‌పై అడవి శేష్ స్పందించాడు.

“గయ్స్ అండ్ గర్ల్స్.. నా జీవితంలో పెద్ద విషయం ఏదైనా ఉందంటే అది సినిమాలు. యాక్టింగ్. రైటింగ్.  నాకిష్టమైన వాటిని చేస్తూ నా కలలను సాకారం చేసుకుంటున్నాను. వినమ్రంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. కష్టపడుతున్నాను. నన్ను నేను మెరుగుపరుచుకుంటున్నాను.  నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇంకేం లేదు.” అంటూ తన సమాధానాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఇన్‌డైరక్ట్ గా చెప్పుకున్నాడు. మరి ఇప్పుడైనా ఈ రూమర్స్‌కి చెక్ పడుతుందో, లేదో చూడాలి.