రైలు ఆపేసి బయటకు రావాలని డిమాండ్ చేశారు.. టాలీవుడ్ హీరో నన్ను ఎలా కాపాడారంటే.. విజయశాంతి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దాల సినీ ప్రయాణంలో కథానాయికగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు విజయశాంతి. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆమె మరోసారి వెండితెరపై సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

రైలు ఆపేసి బయటకు రావాలని డిమాండ్ చేశారు.. టాలీవుడ్ హీరో నన్ను ఎలా కాపాడారంటే.. విజయశాంతి..
Vijaya Shanthi

Updated on: Nov 07, 2026 | 2:57 PM

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతి రౌడీ ఇన్‌స్పెక్టర్ సినిమా షూటింగ్‌లో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటనను ఇటీవల గుర్తుచేసుకున్నారు. ఈ సంఘటనలో నందమూరి బాలకృష్ణ తనకెలా సహాయపడ్డారో ఆమె వివరించారు. నంద్యాలలో ఒక పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి రైలును అడ్డుకున్నారు. జ్వరం, నీరసంతో ఉన్న విజయశాంతిని బయటికి రావాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో బాలకృష్ణ చొరవ తీసుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఆమెకు రక్షణ కల్పించారని విజయశాంతి తెలిపారు. సుమారు గంటన్నర పాటు రైలు ఆగిపోయిందని, బాలకృష్ణ జోక్యంతోనే పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, సినిమా కార్యక్రమాలకు, పార్టీలకు తాను సాధారణంగా దూరంగా ఉంటానని విజయశాంతి స్పష్టం చేశారు. చిన్నతనం నుంచీ షూటింగ్‌లు, ఇల్లు, ఆ తర్వాత రాజకీయాలు మాత్రమే తన ప్రపంచమని, పార్టీలు, ఫంక్షన్లకు వెళ్ళడం తనకు నచ్చదని వివరించారు. 100 రోజుల వేడుకలు వంటి తప్పనిసరి సందర్భాలలో మాత్రమే వెళ్తానని, షీల్డ్ తీసుకుని అరగంటలోనే తిరిగి వస్తానని ఆమె పేర్కొన్నారు.

తన సినీ జీవితంలో కీలకపాత్ర పోషించిన వారిని విజయశాంతి గుర్తుచేసుకున్నారు. విజయనిర్మల, కృష్ణ, దాసరి నారాయణరావు, టి. కృష్ణ వంటి వారిని తన జీవితంలో మర్చిపోలేని వ్యక్తులుగా అభివర్ణించారు. విజయనిర్మల తనను చిన్నపిల్లగా ఉన్నప్పుడే కృష్ణ పక్కన హీరోయిన్‌గా పరిచయం చేశారని, తల్లిలా చూసుకున్నారని ఆమె సంతోషంగా తెలిపారు. వీరితో పాటు భారతీరాజా, కే. విశ్వనాథ్, జంధ్యాల, మోహన్ గాంధీ, కోడిరామకృష్ణ వంటి దర్శకులను కూడా మర్చిపోలేనని, వారు తనకు మంచి పాత్రలు ఇచ్చారని పేర్కొన్నారు.

రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ, రాజకీయాల్లో ఎత్తుగడలు (పాలిటిక్స్) సహజమని, వాటిని ఎదుర్కొంటూనే ముందుకు సాగాలని విజయశాంతి అభిప్రాయపడ్డారు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తాను తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించానని, ఇది చిన్న విషయం కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టినప్పుడు చాలా మంది తనను వెటకారం చేశారని, ఒక మహిళగా ఇది అవసరమా అని ప్రశ్నించారని గుర్తుచేసుకున్నారు. అయితే, తాను దేనినీ పట్టించుకోకుండా తన లక్ష్యాన్ని సాధించానని, ప్రజలకు మంచి చేసే రాజకీయాలను మాత్రమే చేయాలనేది తన సిద్ధాంతమని ఆమె స్పష్టం చేశారు

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Loading...
Unable to load recommendations.
Follow Us