Tapsee Pannu: టాలీవుడ్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ.. ఇక్కడి కంటే అక్కడే..

|

Nov 27, 2022 | 3:50 PM

‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార తాప్సీ పన్ను. తొలి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసిందీ బ్యూటీ. అనంతరం పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. అనంతరం బాలీవుడ్‌ బాట పట్టిన..

Tapsee Pannu: టాలీవుడ్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ.. ఇక్కడి కంటే అక్కడే..
Tapsee Pannu
Follow us on

‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార తాప్సీ పన్ను. తొలి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసిందీ బ్యూటీ. అనంతరం పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. అనంతరం బాలీవుడ్‌ బాట పట్టిన ఈ ఢిల్లీ భామ అక్కడ మాత్రం సక్సెస్‌ను రుచి చూసింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ విజయాలతో మోస్ట్‌ సక్సెస్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా నటనకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో నటిస్తూ మెప్పించింది. అందం, అభినయమే కాదు కాంట్రవర్సీలతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది తాప్సీ. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ వ్యాఖ్య చేస్తూ అందరిని తనవైపు తిప్పుకుంటుంది.

గతంలో తెలుగు సినిమా పరిశ్రమ గురించి, ఇక్కడి మేకింగ్ స్టైల్‌ గురించి తాప్సీ కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా టాలీవుడ్‌పై మరోసారి అలాంటి సంచలన వ్యాఖ్యలే చేసిందీ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది.. ‘నేను దేనిగురించైనా మాట్లాడేముందు మంచి-చెడు చూస్తా. చెప్పాల్సిన విషయం ముఖం మీదనే చెప్పేస్తా. నేను ఇలా మాట్లాడటం కొందరికి నచ్చదు. అర్థం చేసుకోకుండా నాకు పొగరు అని కామెంట్ చేస్తారు. అయినా లెక్క చేయను. మొదట నాకు సినిమాలు ఎలా ఎంచుకోవాలే తెలియలేదు. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. క్యారెక్టర్‌ నచ్చితేనే ఓకే చెబుతున్నాను. నాటి టాలీవుడ్‌తో పోలిస్తే బాలీవుడ్ మంచి అవకాశాలు ఇచ్చింది’ అంటూ వ్యాఖ్యానించిందీ బ్యూటీ.

అయితే మంచి కథ వస్తే మాత్రం తెలుగులో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టేసింది. తాప్సీ ప్రస్తుతం మూడు హిందీ, రెండు తమిళ సినిమాల్లో నటిస్తోంది. మరి తాప్సీ టాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారానికి దారి తీస్తుందో చూడాలి. ఇక అందం గురించి తనదైన శైలిలో మాట్లాడింది తాప్సీ.. అందం అనిర్వచనీయమైందని. చూసే కళ్లను బట్టి ఉంటుందని చెప్పుకొచ్చింది. అందమనేది మన ఆలోచనపైనా ఆధారపడి ఉంటుంది. చిన్నప్పుడు నేను స్నేహితులతో పోల్చుకుని అందంగా లేనని తెగ బాధపడేదాన్ని. ఇప్పుడు అసలైన అందం ఏమిటన్నది అర్థమైంది. మనల్ని మనం ప్రేమించడం నేర్చుకుంటే.. అదే అందం, ఆనందం. నా ఫిలాసఫీ ఇదే అంటూ తనదైన ఫిలాసపీ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..