Samantha: ‘మేము మూవ్‌ ఆన్‌ అయ్యాం.. మీ పని మీరు చూసుకోండి’.. తప్పుడు వార్తలపై స్పందించిన సమంత..

| Edited By: Rajitha Chanti

Jun 21, 2022 | 1:45 PM

Samantha: సమంత, నాగ చైతన్యల విడాకుల వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సని పనిలేదు. ప్రేమ బంధాన్ని, పెళ్లిగా మార్చుకున్న ఈ జంట తమ వివాహ బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టడంతో...

Samantha: మేము మూవ్‌ ఆన్‌ అయ్యాం.. మీ పని మీరు చూసుకోండి.. తప్పుడు వార్తలపై స్పందించిన సమంత..
Samantha
Follow us on

Samantha: సమంత, నాగ చైతన్యల విడాకుల వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సని పనిలేదు. ప్రేమ బంధాన్ని, పెళ్లిగా మార్చుకున్న ఈ జంట తమ వివాహ బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఇక వీరి వ్యవహారం ఒక్క తెలుగు ఇండస్ట్రీకే పరిమితం కాకుండా ఇండియా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తామిద్దరం ఏకాభిప్రాయంతో విడిపోతున్నట్లు ప్రకటించినప్పటికీ ఇప్పటికే నెట్టింట ఈ అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. అడపాదడపా సమంతను టార్గెట్‌ చేస్తూ నెట్టింట కొన్ని పోస్ట్‌లు వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

తాజాగా ఇలాంటి కొన్ని వార్తలపైనే తనదైన స్పందించింది సమంత. తనపై ట్రోల్‌ చేస్తున్న వారికి అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చింది. ఈ విషయమై ట్వీట్‌ చేసిన సమంత.. ‘అమ్మాయిలపై ఏవైనా పుకార్లు వస్తే అవి కచ్చితంగా నిజమని నమ్ముతారు. అదే అబ్బాయిపై పుకార్లు వస్తే మాత్రం, వాటిని అమ్మాయి చేయించింది అంటారు. ఇప్పటికైనా ఎదగండి. మేము పాత జ్ఞాపకాలను మరిచిపోయి మూవ్‌ ఆన్‌ అవుతున్నాం. మీరు కూడా ముందుకువెళ్లండి. మీరు చేస్తున్న పనిపై, మీ కుటుంబాలపై దృష్టిసారించండి’ అంటూ ఘాటూగా స్పందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..