Samantha: పుష్పలో ఐటెం సాంగ్‌.. హాలీవుడ్‌లో ఓ సినిమా.. సమంత జోరు మాములుగా లేదుగా..

|

Nov 14, 2021 | 6:15 PM

Samantha: నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సినిమాల వేగాన్ని తగ్గించింది సమంత. ఆచితూచి సినిమాలకు ఓకే చెబుతూ కేవలం కొన్ని చిత్రాల్లోనే నటించింది. అయితే ఇటీవల నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత...

Samantha: పుష్పలో ఐటెం సాంగ్‌.. హాలీవుడ్‌లో ఓ సినిమా.. సమంత జోరు మాములుగా లేదుగా..
Samantha
Follow us on

Samantha: నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సినిమాల వేగాన్ని తగ్గించింది సమంత. ఆచితూచి సినిమాలకు ఓకే చెబుతూ కేవలం కొన్ని చిత్రాల్లోనే నటించింది. అయితే ఇటీవల నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సామ్ మళ్లీ కెరీర్‌లో స్పీడ్‌ పెంచే పనిలో పడింది. ఈ క్రమంలోనే వరుస సినిమాలకు ఓకే చెబుతూ బిజీగా మారిపోయింది. ఓవైపు తెలుగు, తమిళంలో నటిస్తూనే బాలీవుడ్‌ వైపు కూడా అడుగులు వేస్తోందీ బ్యూటీ. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది అక్కడ కూడా అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత కెరీర్‌కు సంబంధించిన రెండు ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

వీటి ప్రకారం.. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ చిత్రంలో సమంత ఐటెం సాంగ్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సమంతకు భారీగానే ముట్టజెప్పనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పాట పార్ట్‌1లో ఉంటుందా.? పార్ట్ 2లో ఉంటుందా.? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే సమంత కెరీర్‌కు సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. సమంత ఓ హాలీవుడ్‌ చిత్రంలో నటించనుందనేది సదరు వార్త సారాంశం.

ఓ బేబీ చిత్రాన్ని నిర్మించిన సునీత తాటి నిర్మాతగా వ్యవహరించనున్న ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే హాలీవుడ్‌ చిత్రంలో సామ్‌ నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా విడాకుల తర్వాత కెరీర్‌లో వేగాన్ని పెంచిన సమంత వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.

Also Read: Cyber Crime: పిల్లలపై 400 శాతం పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు.. ఎన్‌సీఆర్‌బీ డేటాలో విస్తుగొలిపే విషయాలు..!

Mobile Data Plans: 1జీబీ డేటా రూ.38,000.. ఎక్కడో తెలుసా? నివేదికలో నమ్మలేని నిజాలు..!

MP CM Shivraj: వస్తువులను, ఎరువులను ఉత్పత్తిచేయడం కోసం ఆవుపేడ కొనుగోలు చేయడానికి చూస్తున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం