సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉండే సమంత ఇటీవల ఒక్కసారిగా సైలెంట్ అయిన విషయం తెలిసిందే. సామ్ చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుండడమే దీనికి కారణమంటూ నెట్టింట వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై సమంత ఎప్పుడూ అధికారికంగా స్పందిచంలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక్క పోస్ట్‌తో అన్ని పుకార్లకు చెక్ పెట్టింది. తాను మ్యూసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. చేతికి సెలైన్‌తో డబ్బింగ్ చెబుతున్న సమయంలో వెనకాల నుంచి తీసిన ఓ ఫొటోను షేర్ చేసిన సమంత సుదీర్ఘంగా పోస్ట్‌ను రాసుకొచ్చింది.
సమంత పోస్ట్ ద్వారా తెలిపిన అంశాలు ఇవే.. ‘యశోద సినిమా ట్రైలర్‌కు వచ్చిన ఇచ్చిన రెస్పాన్స్ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అదే మీకు, నాకు మధ్య ఉన్న బంధం. అదే ప్రేమతో నేను ఈ కష్టాలన్నింటిని ఎదుర్కొంటున్నాను. నేను మ్యూసిటిస్ (కండరాల బలహీనత, ఎక్కువ సేపు నిల్చోలేకపోవడం, నడవ లేకపోవడం, నీరసంగా ఉండటం దాని లక్షణాలు) అనే వ్యాధితో బాధపడుతున్నాను. గత కొన్ని నెలల క్రితమే ఈ వ్యాధి సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా మీకు చెబుతున్నాను. అయితే ప్రతీ విషయాన్ని ఇలా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని నా భావన. త్వరలోనే నేను ఈ సమస్య నుంచి బయటపడతానని డాక్టర్లు ధీమా వ్యక్తం చేశారు’ అని రాసుకొచ్చింది.
ఇక తన జీవితంలో ఎదురైన సంఘటన గురించి వివరిస్తూ.. ‘నేను మానసికంగా, శారరీకంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. అందులో కొన్ని నేను భరించలేని స్థాయిలో వచ్చాయి. అవన్నీ ఎలాగో గడిచిపోయాయి. ఈ సమస్య కూడా త్వరలోనే ముగిసిపోతుంది అని ఆశిస్తున్నాను’ అంటూ పేర్కొంది సామ్. సమంత పోస్ట్ చేసిన ఈ పోస్ట్‌తో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సమంత త్వరలోనే పూర్తిగా కోలుకోవాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..