నట సమంత ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. విడాకుల వ్యవహారం తర్వాత నుంచి సామ్ నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇక సామ్ తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించి అందరినీ ఒక్కసారిగా షాక్‌కి గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా శాకుంతంలో ఈవెంట్‌లో స్టేజ్‌పై కంటి తడి పెట్టుకోవడం కూడా వైరల్‌గా మారింది. ఇక తాజాగా సమంత మరోసారి వార్తల్లో నిలిచారు.
తమిళనాడులోని దిండిక్కల్ జిల్లాలోని పళని సుబ్రమణ్యస్వామి ఆలయంలో సమంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ కింది నుంచి పై వరకు మెట్టు మెట్టుకు హారతి వెలిగించారు సమంత. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని పళని సుబ్రమణ్య స్వామికి సామ్ ప్రత్యేక పూజలు నిర్వహించిందని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Actress @Samanthaprabhu2 Pics from Pazhani Murugan Temple ❤️?#Shaakuntalam !! #Samantha#SamanthaRuthPrabhu? #SamanthaRuthPrabhu pic.twitter.com/lWQzX5iAl9
— ???? ???????? (@TN_SamanthaFans) February 13, 2023
ఇదిలా ఉంటే సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ఖుషీతో పాటు, హిందీలో ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోన్న విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..