Rashi Khanna: ‘మద్రాస్ కేఫ్’ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార రాశీఖన్నా. అనంతరం ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే కుర్రకారును ఫిదా చేసింది. ఒక్క సినిమాతోనే భారీగా క్రేజ్ దక్కించుకున్న ఈ చిన్నది అనతి కాలంలోనే టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ దాదాపు అందరూ యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగు, తమిళ సినిమాల్లో వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న సమయంలోనే ఈ బ్యూటీ.. ‘రుద్ర’ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది. ఈ వెబ్ సిరీస్‌తో బీటౌన్ ప్రేక్షకులను కూడా ఫిదా చేసింది. దీంతో అక్కడ కూడా వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ చిత్రాల్లోనూ బిజీగా ఉందీ బ్యూటీ. దీంతో బిజీ బిజీగా గడిపేస్తోంది. ఎంతలా అంటే కనీసం నిద్ర పోవడానికి కూడా సమయం సరిపోన్నంతలా.. ఈ విషయాన్ని రాశీఖన్నా తానే స్వయంగా తెలిపింది. బిజీ షెడ్యూల్స్‌తో కనీసం నిద్ర పోయే సమయం కూడా లేదని చెబుతోంది. వరుస షూటింగ్స్‌తో నిద్ర పోవడానికి సమయం దొరకడం లేదని చెప్పుకొచ్చింది. ఇటీవల తమిళ చిత్రం ‘సర్దార్’ షూటింగ్ పాల్గొని తిరిగి రాత్రికి రాత్రే ఢిల్లీకి వచ్చిన రాశీఖన్నా.. ఉదయాన్నే మళ్లీ హిందీ చిత్రం ‘యోధ’ సెట్స్‌లో పాల్గొంది.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వేదికగా అభిమానులతో పంచుకున్న ఈ బ్యూటీ. ‘బిజీ షెడ్యూల్‌తో కునుకు కూడా తీయలేని పరిస్థితి ఉంది. కానీ ఈ కష్టన్ని భరించక తప్పదు. సినిమా తారల జీవితం అంటేనే అంత. ఈ కష్టంలో కూడా ఇష్టాన్ని వెతుక్కుంటున్నాను’ అని సినిమాపై తనకు ఉన్న ఇష్టాన్ని చెప్పుకొచ్చింది. ఇదిలా రాశీ ప్రస్తుతం తమిళంలో నాలుగు సినిమాలు, హిందీలో ఒక సినిమాతో పాటు తెలుగులో గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్యతో ‘థాంక్యూ’ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
Also Read: IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయంతో స్టార్ ఆల్ రౌండర్ దూరం?
Housing Prices: వచ్చే ఆరు నెలల్లో ఇళ్ల ధరలు పెరిగే అవకాశం.. కారణాలు ఇలా ఉన్నాయి..!
Bengal Assembly Fights: బెంగాల్ అసెంబ్లీలో తన్నులాట.. టీఎంసీ-బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ