Rakul Preet SIngh: భావోద్వేగాలకు ఎవరూ అతీతులు కాదు. కోపం, ప్రేమ, సంతోషం ఇవన్నీ సహజ లక్షణాలు. అయితే మనుషులకు ఉండే మరో సహజ లక్షణం ఈర్ష్య. మనకంటే ఎక్కువ స్థానంలో ఉన్న వారిని చూసి ఈర్ష్య పడుతుంటారు. అందరూ కాకపోయినా మెజారిటీ మంది ఇలానే ఫీలవుతారు. అయితే ఇది అంత మంచి లక్షణం కాదని చెబుతోంది అందాల తార రకుల్ ప్రీత్‌సింగ్. కన్నడ చిత్రం ‘గిల్లి’తో వెండి తెరకు పరిచయమైన రకుల్.. ‘కెరటం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అనంతరం వెనక్కి తిరిగి చూడలేదు ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోందీ బ్యూటీ.
ప్రస్తుతం బాలీవుడ్‌లో రకుల్ నటించిన ఆరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఉండే పోటీతత్వం గురించి తాజాగా రకుల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయమై రకుల్ మాట్లాడుతూ.. ‘వృత్తిపరంగా తోటి నటీమణులతో నాకు ఎలాంటి అభద్రతా భావం లేదు. కేవలం ట్యాలెంట్ ఆధారంగానే అవకాశాలు దక్కుతాయి. కొందరు అద్భుతమైన ప్రతిభతో సినిమాల్లో రాణిస్తారు. ‘మిమి’లో కృతిసనన్, ‘గంగూబాయి కథియావాడి’ చిత్రంలో అలియాభట్‌ల నటన నన్నెంతగానో ఆకట్టుకుంది. ఈర్ష్యతో రగిలిపోతే సమయం వృథా చేసుకోవడం తప్ప సాధించేది ఏమి ఉండదు’ అని చెప్పికొచ్చిందీ బ్యూటీ.
రకుల్ నటిస్తోన్న సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం హిందీలో అటాక్, రన్‌వే 34, మిషన్ సిండ్రెల్లా, డాక్టర్ జీ, థాంక్‌గాడ్, ఛత్రీవాలీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు తమిళంలో అయాలన్, 31 అక్టోబర్ లేడీస్ నైట్, ఇండియన్ 2 సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు తెలుగులోనూ విడుదల కానున్నాయి.
Also Read: Naming Children: పిల్లలకి పేరు పెడుతున్నారా.. పొరపాటున ఈ తప్పులు చేయకండి..!
Vitamin C: విటమిన్ సి తో చర్మం కాంతివంతం.. సమ్మర్‌లో ఇలా చేయండి..!
Viral Video: అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. ఈ యువతి పరిస్థితి చూస్తే మీరూ జాలిపడాల్సిందే!