Tollywood: స్కూల్లో టాపర్ ఈ అమ్మాయి.. IAS కావాల్సిన బ్యూటీ హీరోయిన్ అయ్యింది..

|

Oct 27, 2024 | 8:57 AM

సోషల్ మీడియాలో గత కొద్ది రోజులు సమంత, శ్రీలీల, పూజా హెగ్డే, సాయి పల్లవి, రష్మిక మందన్నా.. ఇలా చాలా మంది హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో హీరోయిన్ స్కూల్ డేస్ ఫోటో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. IAS కావాల్సిన ఆ అమ్మాయి.. ఇప్పుడు హీరోయిన్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..

Tollywood: స్కూల్లో టాపర్ ఈ అమ్మాయి.. IAS కావాల్సిన బ్యూటీ హీరోయిన్ అయ్యింది..
Actress..
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి చిన్న విషయం తెగ ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా ప్రతి అందమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకునేందుకు.. స్నేహితులతో పంచుకోవడానికి సహాయపడుతుంది. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా త్రోబ్యాక్ ట్రెండ్ నెట్టింట హల్చల్ చేస్తుంది. తమ చిన్ననాటి ఫోటోలను పంచుకుంటున్నారు. అలాగే సెలబ్రెటీస్ కూడా తమ బాల్యం తాలూకూ తీపి జ్ఞాపకాలను నెట్టింట పంచుకుంటున్నారు. తాజాగా ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. స్కూల్లో టాపర్ ఆ అమ్మాయి. ఉన్నత చదువులు చదివి IAS కావాలని ఎన్నో కలలు కంది.. కానీ అనూహ్యంగా నటన పై ఆసక్తి ఏర్పడింది. ఇంకేముంది సినీరంగుల ప్రపంచంవైపు అడుగులు వేసింది. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా.. సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరంలేని హీరోయిన్.. తనే రాశీ ఖన్నా. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్.

తెలుగులో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ వయ్యారి.. కొన్ని నెలలుగా టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటున్న రాశీకి.. సరైన బ్రేక్ మాత్రం రావట్లేదు. కానీ అటు హిందీలో సినిమాలు చేస్తూ ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొన్న రాశీ.. తన లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

“నా జీవితంలో నేను అనుకున్నది ఏదీ జరగలేదు. నేను విధిని మాత్రమే నమ్ముతాను. నేను కోరుకున్నది ఏదీ ఇప్పటివరకు నాకు దక్కలేదు.. నిజానికి ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాు.. కానీ కాలేదు. మధ్యతరగతి కుటుంబాల్లో పెరిగేవారు ఒక మంచి సేఫ్టీ ఉద్యోగం కావాలని అనుకుంటారు. అలాగే నేను కూడా ఐఏఎస్ అయితే రక్షణగా ఉంటుందని.. అదే కావాలనుకున్నాను. సబ్జెక్టుల్లో నేను టాపర్. కానీ అది కాకుండా హీరోయిన్ అయ్యాను. నటీనటులు కావడం చాలా కష్టం. ప్రపంచం మొత్తంలో భద్రత లేని జాబ్ అంటే అది నటీనటులు కావడమే” అంటూ చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా.

ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..

Arjun Reddy: తస్సాదియ్యా.. ఏం మేకోవర్ భయ్యా.. ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీని ఇప్పుడు చూస్తే ప్రేమలో పడాల్సిందే..

Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్‍ లుక్‏లో తారక్.. వేరేలెవల్ అంతే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.