Priya Bhavani Shankar: ‘ఆ పేరుతో శరీరాన్ని చూపించడం ఇష్టం లేదు’: ప్రియా భవానీ

|

Oct 06, 2024 | 3:19 PM

ఇక 2022లో వచ్చిన కళ్యాణం కమణీయం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ చిన్నది. తొలి సినిమాతోనే తన అందం, నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిందీ చిన్నది. తాజాగా డిమోంటీ కాలనీ2తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక ప్రస్తుతం బ్లాక్‌ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరిచేందుకు సిద్ధమవుతోందీ బ్యూటీ. ఈ నేపథ్యంలో తాజాగా...

Priya Bhavani Shankar: ఆ పేరుతో శరీరాన్ని చూపించడం ఇష్టం లేదు: ప్రియా భవానీ
Priya Bhavani Shankar
Follow us on

గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ.. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది అందాల తార ప్రియా భవాని శంకర్‌. 2017లో తమిళ ఇండస్ట్రీ ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అతనికాలంలోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. తమిళంలో వరుసగా సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

ఇక 2022లో వచ్చిన కళ్యాణం కమణీయం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ చిన్నది. తొలి సినిమాతోనే తన అందం, నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిందీ చిన్నది. తాజాగా డిమోంటీ కాలనీ2తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక ప్రస్తుతం బ్లాక్‌ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరిచేందుకు సిద్ధమవుతోందీ బ్యూటీ. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ముఖ్యంగా గ్లామర్‌కు సంబంధించిన తనదైన శైలిలో స్పందిచింది. గ్లామర్‌ పాత్రల్లో నటించడంపై ఒకరకంగా ప్రియా భవానీ అసహనం వ్యక్తం చేసింది. ఫ్యాషన్‌ పేరుతో శరీరాన్ని చూపించడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. తన శరీరాన్ని ఎప్పటికీ ఒక వస్తువుగా భావించనని తేల్చి చెప్పిన ప్రియా.. ప్రేక్షకులను రప్పించడం కోసం గ్లామర్‌గా కనిపించడం తనకు నచ్చదని చెప్పింది. అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించనని తేల్చి చెప్పేసింది.

ప్రియా భవానీ లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌..

ఇక.. కెరీర్‌ పరంగా ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ విషయంలోనూ బాధపడకూడదనుకుంటానని, అందుకు అనుగుణంగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటానని ప్రియా భవానీ చెప్పుకొచ్చింది. అయితే నెగిటివ్‌ రోల్‌లో నటించడానికి తాను వెనుకాడనని, అది నా వృత్తి అని చెప్పుకొచ్చింది. ఒక హీరోయిన్‌గా ఫ్యాషన్‌ పేరుతో కొన్నింటిని ప్రమోట్‌ చేయలేనని కూడా తన మనసులో మాట బయటపెట్టింది.

ప్రియా భవానీ లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌..

ఇదిలా ఉంటే ప్రియా కెరీర్‌ తొలినాళ్ల నుంచి గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోంది. గతంలో కూడా గ్లామర్‌ పాత్రలపై తన అసంతృప్తిని వ్యక్తచేసింది. ప్రేక్షకులు కూడా తనను గ్లామర్ పాత్రలో చూడడానికి ఇష్టపడరంటూ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రియా భవానీ .

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..