Payal Rajput: ‘ఆ సమయంలో నన్ను కొందరు తప్పు దారి పట్టించారు’.. పాయల్‌ రాజ్‌పుత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

|

Oct 20, 2022 | 6:40 AM

మంచు విష్ణు హీరోగా తెరకెక్కి చిత్రం 'జిన్నా'. సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. ముఖ్యంగా ట్రైలర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. విష్ణు కెరీర్‌లో ఈ సినిమా బెస్ట్‌ మూవీగా..

Payal Rajput: ఆ సమయంలో నన్ను కొందరు తప్పు దారి పట్టించారు.. పాయల్‌ రాజ్‌పుత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
Payal Rajput
Follow us on

మంచు విష్ణు హీరోగా తెరకెక్కి చిత్రం ‘జిన్నా’. సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. ముఖ్యంగా ట్రైలర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. విష్ణు కెరీర్‌లో ఈ సినిమా బెస్ట్‌ మూవీగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేయడం కూడా సినిమాపై హైప్‌ను పెంచేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌, సన్నీలియోన్‌ హీరోయిన్లుగా నటిస్తోన్న విషయం తెలిసిందే. సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో పాయల్‌ రాజ్‌పుత్‌ మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ.. ఆర్‌క్స్‌ 100 సినిమాతో తనకు మంచి గుర్తింపు వచ్చిందని. అయితే ఆ తర్వాత తన మేనేజర్‌తో పాటు కొందరు తప్పు దారి పట్టించడంతో స్క్రిప్టు వినకుండానే కొన్ని సినిమాల్లో నటించానని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు అలా కాదని, తనకు నచ్చిన కథలోనే నటించేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులకు తప్పకుండా ఆదరిస్తారనే దానికి ఆర్‌ఎక్స్‌ 100 నిదర్శనమని తెలిపిందీ బ్యూటీ.

ఇవి కూడా చదవండి

ఇక కరోనా సమయంలో తనకు బాగా కావాల్సిన వ్యక్తిని కోల్పోయానని చెప్పిన పాయల్‌.. ఆ సంఘటన జీవితమంటే ఏంటో నేర్పిందని వాపోయింది. ఇదిలా ఉంటే పాయల్‌ ప్రస్తుతం కన్నడతో పాటు తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది. మరి జిన్నా పాయల్‌ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..