వెబ్ సిరీస్‏లోకి అడుగుపెట్టనున్న ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్.. ఇంట్రెస్టింగ్ కథతో రాబోతున్న బ్యూటీ ?..

|

Dec 28, 2020 | 11:31 AM

ప్రస్తుత పరిస్థితులలో ఓటీటీ వేదికలకు క్రమంగా క్రేజ్ పెరిగిపోతుంది. దానికి అనుగుణంగానే టాలీవుడ్‏తోపాటు, బాలీవుడ్‏కు చెందిన

వెబ్ సిరీస్‏లోకి అడుగుపెట్టనున్న ఆర్ఎక్స్ 100 హీరోయిన్.. ఇంట్రెస్టింగ్ కథతో రాబోతున్న బ్యూటీ ?..
ఇప్పుడు మరోసారి తాను ఐటమ్ నంబర్ లో నర్తిస్తోందంటూ ప్రచారం సాగుతుంటే అది తట్టుకోలేక వెంటనే అసలు `నేను ఏ ఐటెమ్ నంబర్ చేయడం లేదు!` అని క్లారిటీ  ఇచ్చింది పాయల్ పాప. 
Follow us on

ప్రస్తుత పరిస్థితులలో ఓటీటీ వేదికలకు క్రమంగా క్రేజ్ పెరిగిపోతుంది. దానికి అనుగుణంగానే టాలీవుడ్‏తోపాటు, బాలీవుడ్‏కు చెందిన పలువురు సెలబ్రెటీలు ఇప్పటికే వెబ్‏సిరీస్ ద్వారా డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఇప్పడికే హన్సిక, సమంత, కాజోల్ వెబ్ సిరీస్‏ల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. తాజాగా ఆ జాబితాలోకి మరో హీరోయిన్ చేరింది.

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పాయల్ రాజపుత్. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో తెలుగులో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఆశించినంతగా అవకాశాలను రాబట్టలేకపోయింది పాయల్. అనంతరం పాయల్ నటించిన ఆర్డిఎక్స్ లవ్ కూడా థియేటర్లలో అంతగా హిట్ కాలేకపోయింది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ సీత సినిమాలో ఐటెం సాంగ్‏లో నటించింది. గతేడాది నాగచైతన్య విక్టరీ వెంకటేష కాంబినేషన్‏లో వచ్చిన మల్టీస్టారర్ వెంకిమామ సినిమాలో వెంకటేష్‏కు జోడిగా నటించింది. తాజా సమాచారం ప్రకారం పాయల్ రాజపుత్ ఓ వెబ్ సిరీస్‏లో నటించనున్నట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ అవినాష్ కోకాటి చెప్పిన కథ పాయల్‏కు నచ్చడంతో.. వెంటనే ఈ వెబ్ సిరీస్ చేయడానికి ఓకే చెప్పినట్లుగా టాక్. అయితే ఇది ఒక ఎమోషనల్ సిరీస్ అని, ఇందులో ప్రధాన పాత్ర మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వెబ్ సిరీస్‏లలో నటిస్తే తమ ప్రతిభను కనబర్చడానికి అవకాశం ఉంటుందని అందుకే ఈ వెబ్ సిరీస్‏కు పాయల్ ఓకే చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది.