నిత్యా మేనన్ (Nithya Menen).. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో దూసుకుపోతోన్న ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటూ కథాబలమున్న చిత్రాలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు సాగుతోందీ ముద్దుగుమ్మ. సినిమాల్లో ఎప్పుడూ బొద్దుగా కనిపించే నిత్య ఎప్పుడూ బరువు తగ్గేందుకు (Weightloss) ప్రయత్నించలేదని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అభిమానులు కూడా ఆమెను అలాగే ఇష్టపడుతున్నారని పేర్కొంది. కాగా గత కొన్ని నెలలుగా చిత్రపరిశ్రమకు దూరంగా ఉన్న ఈ బొద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం నాజూకుగా మారాలని ప్రయత్నిస్తోందట. స్లిమ్‌గా కనిపించేందుకు కసరత్తులు కూడా ప్రారంభించిందట. ఇందులో భాగంగా ఇప్పటికే సుమారు 6 కిలోల వరకు బరువు తగ్గిందట.
సర్జరీ చేయించుకోమన్నారు!
తాజాగా నిత్య షేర్ చేసుకున్న లేటెస్ట్ ఫొటోల్లోనూ ఆమె ఎంతో అందంగా కనిపిస్తోంది. స్మార్ట్‌లుక్‌లో కనువిందు చేస్తోంది. పనిలో పనిగా అధిక బరువును తగ్గించేందుకు తాను పాటించిన ఆరోగ్య చిట్కాలను కూడా అభిమానులతో పంచుకుంది. ‘బరువు తగ్గేందుకు కొవ్వు కరిగించే ఆపరేషన్ చేయించుకోవాలని చాలామంది సలహా ఇచ్చారు. అయితే అలా చేయడం నాకు ఏ మాత్రం ఇష్టంలేదు. డైట్ నిపుణుల సలహాలు, సూచనలతో ఆహారంలో మార్పులు చేసుకున్నాను. క్రమం తప్పకుండా వాకింగ్, వ్యాయామాలు చేశాను. ఇలా సుమారు ఐదు నెలల నుంచి డైట్ కంట్రోల్ పాటిస్తున్నాను. నా శ్రమకు ఫలితమే ఈ స్మార్ట్‌లుక్. ఆరు కేజీల వరకు బరువు తగ్గాను. అయినప్పటికీ నేను ఆగను. నా పాత స్లిమ్ లుక్ వచ్చేందుకు కష్టపడుతూనే ఉంటాను’ అని చెప్పుకొచ్చింది నిత్య. కాగా గతేడాది ‘స్కై ల్యాబ్’ సినిమాలో నటించడంతో ఆ సినిమా నిర్మాతగానూ వ్యవహరించిందీ అందాల తార. త్వరలోనే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి ‘భీమ్లానాయక్’ సినిమాతో మన ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈనెల 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
Jio Plans: జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసా..? ప్రయోజనాలు, వాలిడిటీ వివరాలు మీకోసం..
Rajinikanth: సెన్సేషనల్ డైరెక్టర్‌తో కొత్త సినిమాను షురూ చేసిన తలైవా.. 169వ సినిమా అఫీషియల్..