Nayanthara: స్కిన్‌కేర్‌ బ్రాండ్ ప్రారంభించిన నయనతార.. ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లు. ఎందుకంటే..

అయితే ఈ మధ్య కాలంలో వ్యాపార రంగంలోకి అడుగుపెడుతోన్న వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒకప్పుడు కేవలం హీరోలకే పరిమితమైన ఈ ట్రెండ్‌ను ఇప్పుడు హీరోయిన్లు సైతం ఫాలో అవుతున్నారు. బాలీవుడ్‌ నుంచి మొదలు సౌత్‌ నటీమణుల వరకు సొంతంగా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. వ్యాపారంలో తమదైన ముద్ర వేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇలాంటి నటీమణుల జాబితాలో...

Nayanthara: స్కిన్‌కేర్‌ బ్రాండ్ ప్రారంభించిన నయనతార.. ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లు. ఎందుకంటే..
Nayanthara

Updated on: Oct 03, 2023 | 4:16 PM

‘దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే’ సామెత ఉందనే విషయం తెలిసిందే. అయితే ఈ సామెత సినిమా వాళ్లకు సరిగ్గా సరిపోతుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు ఈ సామెత్‌ పర్‌ఫెక్ట్ సూట్ అవుతుంది. అవకాశాలు, పాపులారిటీ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తుంటారు. అందుకోసమే సినిమాలతో షాప్‌ ఓపెనింగ్స్‌, యాడ్స్‌లో నటించడం లాంటివి చేస్తుంటారు.

అయితే ఈ మధ్య కాలంలో వ్యాపార రంగంలోకి అడుగుపెడుతోన్న వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒకప్పుడు కేవలం హీరోలకే పరిమితమైన ఈ ట్రెండ్‌ను ఇప్పుడు హీరోయిన్లు సైతం ఫాలో అవుతున్నారు. బాలీవుడ్‌ నుంచి మొదలు సౌత్‌ నటీమణుల వరకు సొంతంగా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. వ్యాపారంలో తమదైన ముద్ర వేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇలాంటి నటీమణుల జాబితాలో అందాల తార నయనతార మొదటి వరుసలో ఉంటారు. ఇప్పటికే ఎన్నో రకాల బ్రాండ్స్‌ను లాంచ్‌ చేసిన నయన తార తాజా మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిది.

నటి నయనతార ఇటీవల తల సొంత స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ను లాంచ్‌ చేసింది. 9 స్కిన్‌ పేరుతో మొదలు పెట్టిన ఈ వ్యాపారానికి సంబంధించిన వివరాలను గత వారం సోషల్‌ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది. సెప్టెంబర్‌ 29న నయనతార 9స్కిన్‌ పేరుతో స్కిన్‌ కేర్‌ బ్రాండ్‌ను ప్రారంభించింది. అయితే ఇప్పుడిదే నయనకు తలనొప్పిగా మారింది. ఈ బ్రాండ్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో ఆమెకు తీవ్ర నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. కొంతమంది నెటిజన్లు నయనతారను ట్రోల్‌ చేస్తున్నారు. 9స్కిన్‌ ప్రమోషన్స్‌లో భాగంగా నయనతార ఫొటో షూట్ ఇప్పుడు వివాదానికి కారణంగా మారింది.

స్కిన్‌ కేర్‌ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసే సమయంలో అంత మేకప్‌ వేసుకోవడం అవసరమా.? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. నయనతార బ్రాండ్‌ కంటే తనను తాను ఎక్కువగా ప్రమోట్ చేసుకునేలా ఫొటో ఉందంటూ మరో యూజర్‌ స్పందించారు. ఇక మరో యూజర్‌ స్పందిస్తూ మీరు మేకప్‌ వేసుకోకుండా బ్రాండ్‌ను ప్రచారం చేయలేరా.? అని ప్రశ్నించాడు. నయనతార ప్రారంభిచిన ఈ స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ నుంచి ప్రస్తుతం కేవలం 5 ఉత్పత్తులు మాత్రమే ప్రారంభించారు. వీటి ధర రూ. 1000 నుంచి రూ. 1500 వరకు ఉన్నాయి. దీనిపై కూడా నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ఇదిలా ఉంటే నయనతార తన సొంత బ్రాండ్‌ను ప్రారంభించడం ఇదేతొలిసారి కాదు, గతంలోనూ బ్యూటీ ప్రొడక్ట్‌ ద్వారా బిజినెస్‌ రంగంలోకి అడుగుపెట్టింది నయన. ది లిప్‌బామ్‌ కంపెనీ అనే పేరుతో తన సొంత కంపెనీని ప్రారంభించింది. ఏది ఏమైనా నయనతార కొత్త బ్రాండ్ లాంచింగ్ ఈ బ్యూటీకి అనుకోని తలనొప్పి తెచ్చి పెట్టిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే నయనతార కెరీర్‌ విషయానికొస్తే ఈ బ్యూటీ ప్రస్తుతం ఇరైవన్‌ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..