
దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార హన్సిక. తెలుగులో వరుస సినిమా అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ అదే సమయంలో కోలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే ముంబయికి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో వివాహం చేసుకుందీ బ్యూటీ. కతూరియా హన్సిక స్నేహితుడనే విషయం తెలిసిందే. జైపూర్‌లోని ముండోతా కోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
స్నేహితురాలి మాజీ భర్తను హన్సిక వివాహం చేసుకోవడంతో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. హన్సిక తన ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడానికి చిన్న సైజ్ యుద్ధమే చేసింది. హన్సిక వివాహా వేడుకను డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. లవ్ షాదీ డ్రామా పేరుతో వివాహ వేడుకను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే వివాహం తర్వాత కూడా హన్సిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ అందాల తార అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. ఓ నెటిజన్ వివాహం తర్వాత జీవితం ఎలా ఉంది.? ఏవైనా మార్పులు వచ్చాయా.? అని ప్రశ్నించగా హన్సిక బదులిస్తూ.. ‘లైఫ్ చాలా బాగుతుంది. ఇక పెళ్లి తర్వాత మారింది ఇంటి అడ్రెస్’ బధులిచ్చింది. దీంతో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..