Suriya : రాజకీయాల్లోకి హీరో సూర్య !!.. పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన కోలీవుడ్ స్టార్..

కోలీవుడ్ ఇండస్ట్రీలోని తారలు ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారాలు జోరందుకున్నాయి. ఇప్పటికే సొంతంగా పార్టీ స్థాపించి ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు విజయ్ దళపతి. మరోవైపు హీరో ధనుష్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం నడుస్తుంది. అలాగే హీరో సూర్య సైతం రాజకీయాల్లోకి రానున్నారనే రూమర్స్ వినిపిస్తున్న వేళ అసలు విషయం చెప్పారు ఈ స్టార్.

Suriya : రాజకీయాల్లోకి హీరో సూర్య !!.. పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన కోలీవుడ్ స్టార్..
Suriya

Updated on: Nov 10, 2026 | 2:49 PM

కోలీవుడ్ ఇండస్ట్రీలో పొలిటికల్ ఎంట్రీ రూమర్స్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ధనుష్ ఈ ప్రచారం పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు హీరో సూర్య సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తుంది. తాజాగా ఈ రూమర్స్ పై స్పందించారు సూర్య. తనకు రాజకీయాల్లోకి ప్రవేశించే ప్రణాళికలు లేవని స్పష్టం చేశారు. దీపావళి సందర్భంగా విడుదలైన సీన్ సినిమా విజయోత్సవ సభలో సూర్య మాట్లాడుతూ , తాను రాజకీయాల్లోకి ప్రవేశించబోనని, అయితే రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించడానికి ఆసక్తిగా ఉన్నానని సూర్య తెలిపారు. “నేను రాజకీయాల్లోకి ప్రవేశించడం లేదు. అంతమాత్రాన నాకు రాజకీయాలంటే ద్వేషం అని కాదు. నేను రాజకీయాలను నిశ్శబ్దంగా, నిశితంగా గమనిస్తున్నాను” అని సూర్య అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..

ఇదిలా ఉంటే సూర్య సినిమాలతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో తనవంతు సాయం అందిస్తున్నారు. పేద విద్యార్థులు విద్యను అభ్యసించడానికి సహయపడేందుకు సొంతంగా అగరం ఫౌండేషన్ స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు జీవితాన్ని అందించారు. దీంతో ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నాడనే వార్తలు వినిపిస్తున్నారు. ఇప్పుడు సూర్య వ్యాఖ్యలతో ఈ ప్రచారానికి బ్రేక్ పడింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..

సూర్య నటించిన సీన్ చిత్రానికి మలయాళీ డైరెక్టర్ జీతూ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతికల నిర్మాణ సంస్థ 2D ఎంటర్‌టైన్‌మెంట్ , ఝగారం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇందులో నజ్రియా నజీమ్, నటుడు నస్లెన్ కీలకపాత్రలు పోషించారు. నవంబర్ 6న విడుదలైన ఈ చిత్రం, తొలి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 116 కోట్లకు పైగా వసూలు చేయగా, మూడో రోజు నాటికి భారతదేశంలో దీని నికర వసూళ్లు రూ. 62.75 కోట్లుగా ఉన్నాయని తెలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Loading...
Unable to load recommendations.
Follow Us