Actor Sunil: హీరోగా రెండు సినిమాలను అనౌన్స్ చేసిన సునీల్.. ఈసారి పోలీస్ పాత్రలో మరింత పవర్‌ఫుల్‌ గా..

|

Mar 01, 2022 | 4:06 PM

స్టార్ కమెడియన్ గా ఎంట్రీ తనదైన టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు సునీల్ (Sunil). ఆతర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో  హీరోగా మారారు.

Actor Sunil: హీరోగా రెండు సినిమాలను అనౌన్స్ చేసిన సునీల్.. ఈసారి పోలీస్ పాత్రలో మరింత పవర్‌ఫుల్‌ గా..
Sunil
Follow us on

స్టార్ కమెడియన్ గా ఎంట్రీ తనదైన టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు సునీల్ (Sunil). ఆతర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో  హీరోగా మారారు. మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆతర్వాత పూల రంగడు సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ కూడా చేశాడు. ఇది కూడా మంచి విజయం సాధించింది. అయితే ఆ తర్వాత   చేసిన సినిమాలు మాత్రం మిశ్రమ ఫలితాలు అందుకున్నాయి. వరుస ప్లాఫులు ఎదురయ్యాయి. దీంతో అరవింద సమేత, చిత్రలహరి సినిమాలతో మళ్లీ తనలోని కమెడియన్‌ బయటకు తీశాడు. ఇదే క్రమంలో తనలోని సరికొత్త నటుడిని పరిచయం చేస్తూ  ‘డిస్కో రాజా’ సినిమాతో విలన్ గా మారాడు సునీల్‌. కలర్ ఫోటో సినిమాలోనూ క్రూరత్వం ప్రదర్శించి భయపెట్టాడు. ఇక ఇటీవల విడుదలైన ‘పుష్ప’ ( Pushpa) లో మంగళం శ్రీనుగా మంచి మార్కులు కొట్టేశాడు. ‘పుష్ప’ రెండో భాగంలోనూ కీలక పాత్రలో నటించనున్నాడు సునీల్‌.

కాగా కొన్ని రోజుల క్రితం ‘కనబడట్లేదు’ అంటూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలో హీరోగా కనిపించాడు సునీల్‌. ఇది కూడా ఆయనకు విజయాన్ని అందించలేకపోయింది. అయితే హీరోగా తన ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు ఈ నటుడు. తాజాగా తన పుట్టిన రోజును పురస్కరించుకుని తను హీరోగా నటిస్తున్న రెండు కొత్త చిత్రాల పోస్టర్స్ ను విడుదల చేశాడు సునీల్‌.. అందులో ఒకటి ‘ బుజ్జీ ఇలారా’ అయితే.. మరొక సినిమా ‘కుంభకర్ణ’. ఈ రెండు చిత్రాల్లోనూ విభిన్నమైన గెటప్స్ తో కనిపించాడు సునీల్‌. కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ‘ బుజ్జీ ఇలారా’ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో సునీల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. అలాగే కొత్త దర్శకుడు అభిరామ్ దర్శకత్వంలో ‘కుంభకర్ణ’ రూపొందుతోంది. ఇందులో సునీల్ సూరజ్ దేవ్ అనే పాత్రను చేస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాలతోనైనా సునీల్ మళ్లీ హీరోగా బిజీ అవుతాడేమో చూడాలి.

Also Read:Chor Bazaar: పాతికేళ్ల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తోన్న జాతీయ ఉత్తమ నటి.. ఆకాశ్ పూరీ సినిమాతో సెకెండ్‌ ఇన్సింగ్స్‌..

Sarkaru Vaari Paata: సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు శివరాత్రి కానుక.. మాస్‌ కిక్కు ఇస్తోన్న మహేశ్‌ కొత్త పోస్టర్‌..