Sobhan Babu : సినిమా ఇండస్ట్రీలో ఎందరో వందల కోట్లు కూడబెట్టడానికి అసలు కారణం శోభన్ బాబు అని తెలుసా?

|

Mar 02, 2021 | 11:47 AM

ప్రముఖ సీనియర్ నటుడు, రాజకీయ నేత మురళీ మోహన్ తాను ఆర్ధికంగా ఈరోజు ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం పలు సార్లు మీడియా ముందు చెప్పారు. తాను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు మొత్తాన్ని సినిమా...

Sobhan Babu : సినిమా ఇండస్ట్రీలో ఎందరో వందల కోట్లు కూడబెట్టడానికి అసలు కారణం శోభన్ బాబు అని తెలుసా?
Follow us on

Murali Mohan about Sobhan Babu : ప్రముఖ సీనియర్ నటుడు, రాజకీయ నేత మురళీ మోహన్ తాను ఆర్ధికంగా ఈరోజు ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం పలు సార్లు మీడియా ముందు చెప్పారు. తాను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు మొత్తాన్ని సినిమా డిస్ట్రిబ్యూషన్ లో పెట్టి చేతులు కాల్చుకుని దాదాపు ఉత్త చేతులతో శోభన్ బాబు ముందు నిలబడ్డానని మురళీ మోహన్ ఓ సారి గుర్తు చేసుకున్నారు. అప్పుడు శోభన్ బాబు చెప్పిన జీవిత సత్యం తన జీవి విధానాన్ని మార్చేసిందని తెలిపారు. జయభేరి రియల్ ఎస్టేట్, కనస్ట్రక్షన్స్ పేరిట వేల కోట్ల టర్నోవర్ సంస్థలను సృష్టించిన మురళీమోహన్ తనకు అసలు భూమిపై పెట్టుబడి పెట్టమని గీతోపదేశం చెప్పింది శోభన్ అని చెప్పారు. ఇంతకూ మురళీ మోహన్, చంద్రమోహన్ సహా సినిమా ఇండస్ట్రీలోని అందరికీ శోభన్ బాబు పదే పదే చెప్పిన గొప్ప సలహా ఏంటో తెలుసా?

‘ఈ ప్రపంచంలో భూమి అనేది 25శాత‌మే. ఇందులో మంచుకొండ‌ల్లో, ఎడారుల్లో నివ‌శించ‌లేం. 15శాత‌మే మ‌నుషులు నివ‌శించేది. ప్లేస్ మాత్రం అదే ఉంటుంది. ఎక్కువ మ‌నం త‌యారుచేయ‌లేం. రాబోయే రోజుల్లో భూమికి విలువ చాలా ఎక్కువ ఉంటుంది. నాకు వ‌చ్చే రెమ్యూన‌రేష‌న్‌తో ల్యాండ్స్ కొంటున్నా. నువ్వు కూడా ఆ దిశ‌గా ప్ర‌య‌త్నించు’ అని ఆయన ప్రతి ఒక్క నటీ నటులకు ఓ పాఠం లాగా వెంటబడి మరీ చెప్పేవారు. తాను చెప్పడమే కాదు శోభన్ బాబు అక్షరాలా ఆచరించి చూపించారు.

చెన్నై సహా పలు ప్రాంతాల్లో భూములు కొన్న శోభన్ బాబు కొన్ని తరాలు తిన్నా తరగని ఆస్తులు తన పిల్లలకు ఇచ్చి వెళ్లారు. అయితే శోభన్ బాబు సలహా మేరకు మురళీ మోహన్ భూమి మీద పెట్టుబడి పెట్టాడు. భూమి మీద పెట్టింది ఎక్క‌డికి పోదు అని ల్యాండ్స్ కొన‌డం మొద‌లుపెట్టి.. ఎక్కడ స్థలం దొరికినా అక్కడో వెయ్యి గ‌జాలు, ఇక్క‌డో 500 గ‌జాలు ఇలా చెన్నైలోనే కొన్నారు. కాలక్రమంలో తెలుగు ఇండ‌స్ట్రీ హైదరాబాద్ కు షిఫ్టింగ్‌ అయింది.

హైద‌రాబాద్‌కి వచ్చిన తర్వాత కూడా ఓ వైపు సినిమాల్లో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ.. అలా వచ్చిన సంపాదన్ని శోభన్ బాబు గారు చెప్పినట్లు ఇక్కడ భూములు, స్థలాలు కొనడం మొదలు పెట్టారు. దీంతో ఇప్పటి ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన మహా మహా నటులెందరో తర్వాత తినడానికి ముద్ద దొరక్క అవస్థలు పడ్డారు. మహా నటి సావిత్రి, విలక్షణ, అద్వితీయ నటుడు కాంతారావు, సూర్యాకాంతం…. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద చేంతాడే అవుతుంది. పాపం వారంతో వెండితెరకు వెలుగు జిలుగు అద్దినవారే… తెలుగు తెర ఇప్పుడు ఇంతలా మెరుస్తోందంటే అందులో వారి అకుంఠిత దీక్ష, నటనా కౌశలం ఎంతో ఉంది. కాని తాము నటించిన సినిమాలకు అందుకున్న పారితోషికాన్ని సరైన రీతిలో పెట్టుబడి పెట్టుకోలేదు చాలా మంది. సినిమాల్లో వేషాలు వచ్చినంత కాలం మహా రాజులు, రాణుల్లా బతికారు. ఆ తర్వాత దుర్భర దారిద్యాన్ని అనుభవించారు. సినిమాలు, రాజకీయాల్లోనూ రాణించినా ఆర్థిక రంగంలో సరైన పెట్టుబడులతో రాణించిన నటులు మాత్రం చాలా కొందరే. అందులో వారందరికీ ఆద్యుడిగా చెప్పుకోతగిన వాడు శోభన్ బాబు అనే విషయం ఇప్పటి తరం సినీ ప్రేక్షకులు చాలా మందికి తెలియదు.

Also Read:

ఐ యామ్ సింగిల్.. మెసేజ్ చేసేందుకు, కాల్ మాట్లాడేందుకు ఎవరూ లేరు: నిధి అగర్వాల్

 తెలుగు సినీ చరిత్రను తిరగరాసి థియేటర్స్‌లో 1000 రోజులకు పైగా ఆడిన సినిమాలు ఏమిటో తెలుసా..!