AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: నానికి జోడిగా జాన్వీ నటించనుందా.? వార్తలపై స్పందించిన నేచురల్‌ స్టార్‌

అందుకు అనుగుణంగానే తొలి సినిమాతోనే తెలుగు జాన్వీ ప్రేక్షకులను ఫిదా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దేవర మూవీ నుంచి విడుదలైన పాటలే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. తనదైన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చన్నది. ఈ పాటలు నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా విడుదల కూడా కాకముందే తెలుగులో జాన్వీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి...

Nani: నానికి జోడిగా జాన్వీ నటించనుందా.? వార్తలపై స్పందించిన నేచురల్‌ స్టార్‌
Janhvi Nani
Narender Vaitla
|

Updated on: Aug 26, 2024 | 9:33 AM

Share

అలనాటి అందాల తార దివంగత శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ ఇండస్ట్రీకి వచ్చిన 6 ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరిచేందుకు సిద్ధమవుతోంది. నిజానికి చాలా రోజుల నుంచి జాన్వీ కపూర్ టాలీవుడ్‌ తెరకు పరిచయంకానుందని వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న దేవర చిత్రంతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.

అందుకు అనుగుణంగానే తొలి సినిమాతోనే తెలుగు జాన్వీ ప్రేక్షకులను ఫిదా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దేవర మూవీ నుంచి విడుదలైన పాటలే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. తనదైన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చన్నది. ఈ పాటలు నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా విడుదల కూడా కాకముందే తెలుగులో జాన్వీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి.

ఇప్పటికే బుచ్చిబాబు, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో జాన్వీని తీసుకోవాలని మేకర్స్‌ డిసైడ్‌ అయ్యారు. ఇందుకు సంబంధించి జాన్వీ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఈ సినిమాతో పాటు మరికొందరు నిర్మాతలు సైతం జాన్వీ డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. తాజాగా హీరో నాని సరసన జాన్వీ నటించనుందని కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా నాని ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ప్రస్తుతం నాని నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాని రూమర్స్‌కి చెక్‌ పెట్టారు. తన తర్వాతి సినిమాలో జాన్వీ కపూర్‌ నటించనుందన్న ప్రచారంపై నాని మాట్లాడుతూ… ‘నా తర్వాత చిత్రంలో జాన్వీ నటించనుంది అనేది కేవలం ఒక రూమర్‌ మాత్రమే. బహుశా ఆమెను తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ అవుతోంది. నేను కొన్ని రోజులుగా వరుస షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నాను. అందుకే ఆ ప్రాజెక్ట్‌ గురించి వివరాలు తెలుసుకోలేకపోతున్నా’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్