Mahesh Babu: మహేష్‌ బాబు గ్లామర్‌ సీక్రెట్‌ ఏంటో తెలుసా.? ఆయన మాటల్లోనే..

|

Jan 07, 2024 | 8:10 AM

గ్లామర్‌కు పెట్టింది పేరు మహేష్‌. ఈ మిల్క్‌ బాయ్‌ గ్లామర్‌ చూస్తుంటే అసలు వయసు పెరుగుతుందా, తగ్గుతుందా అనిపించకమానదు. మహేష్‌ అసలు వయసు తెలిస్తే ఔరా అనాల్సిందే. అలా తన గ్లామర్‌ను, ఫిట్‌నెస్‌ను మెయింటెన్‌ చేస్తూ వస్తున్నారు. కెరీర్‌ తొలినాళ్లలో ఎంత స్లిమ్‌గా, గ్లామర్‌గా కనిపించారో ఇప్పుడు...

Mahesh Babu: మహేష్‌ బాబు గ్లామర్‌ సీక్రెట్‌ ఏంటో తెలుసా.? ఆయన మాటల్లోనే..
Mahesh Babu
Follow us on

‘మహేష్‌బాబు.. ఈ పేరులో మత్తు ఉంది, స్టైల్‌ ఉంది, వైబ్రేషన్స్‌ ఉన్నాయి’. ఇది ఓ సినిమాలో డైలాగ్‌. నిజంగానే మహేష్‌ పేరు ఓ సెన్సేషన్‌, రికార్డులకు పెట్టింది పేరు. బాల నటుడిగా మొదలైన మహేష్‌ బాబు ప్రస్థానం స్టార్‌ హీరో స్థాయికి ఎదిగింది. అటు ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించే సత్తా మహేష్‌ సొంతం.

గ్లామర్‌కు పెట్టింది పేరు మహేష్‌. ఈ మిల్క్‌ బాయ్‌ గ్లామర్‌ చూస్తుంటే అసలు వయసు పెరుగుతుందా, తగ్గుతుందా అనిపించకమానదు. మహేష్‌ అసలు వయసు తెలిస్తే ఔరా అనాల్సిందే. అలా తన గ్లామర్‌ను, ఫిట్‌నెస్‌ను మెయింటెన్‌ చేస్తూ వస్తున్నారు. కెరీర్‌ తొలినాళ్లలో ఎంత స్లిమ్‌గా, గ్లామర్‌గా కనిపించారో ఇప్పుడు కూడా మహేష్‌ అలాగే ఉన్నాయి. ఇక తాజాగా మహేష్‌ బాబు. గుంటూరు కారంతో అసలైన సంక్రాంతి మజాను చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

త్రివిక్రమ్‌ దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అంచనాలను పెంచేశాయి. ఇక సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో తాజాగా మహేష్‌బాబు ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరకమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా మంది తన ‘గ్లామర్‌ రహస్యం ఏంట’ని అడుగుతుంటారు… చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా నవ్వుతూ ఉండటమే తన గ్లామర్‌ సీక్రెట్‌ అని అసలు విషయం చెప్పేశారు మహేష్‌.

ఇక తాను ఎవరితోనూ పెద్దగా మాట్లాడనని, సైలెంట్‌గా ఉంటానని చాలా మంది అనుకుంటారన్న మహేష్‌, కానీ తన క్లోజ్‌ సర్కిల్‌లో పూర్తిగా భిన్నంగా ఉంటానని తెలిపారు. తన చుట్టూ ఉన్నవారితో నవ్వుతూ, కబుర్లు చెబుతూ, జోకులు వేస్తూ సరదాగానే గడుపుతానన్నారు. ఇక షూటింగ్‌లకు ఏ మాత్రం బ్రేక్‌ దొరికిగా వెంటనే విదేశాలకు వెళ్లిపోతానన్న మహేష్.. దీనికి కారణం భారత్‌లో ఫ్రీగా ఉండకపోవడమే అన్నారు. విదేశాల్లో తనకు నచ్చిన రెస్టరంట్‌కు వెళ్లొచ్చన్నారు. ఏటు వెళ్లకపోతే.. ఇంట్లోనే ఉంటూ సినిమాలు చూస్తూ, పిల్లలూ, నమ్రత, కుక్క పిల్లలతో టైమ్‌పాస్‌ చేస్తానని చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..