మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారుతున్న నటుడు.. ట్యూన్స్ రెడీ చేస్తున్నాడా..!

కేవలం నటనే కాకుండా కొంతమంది హీరోలలో మరిన్ని కలలు దాగి ఉంటాయి. సమయం వచ్చినప్పుడు వాటిని బయటకు తీస్తుంటారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారుతున్న నటుడు.. ట్యూన్స్ రెడీ చేస్తున్నాడా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 17, 2020 | 2:44 PM

Actor Jai news: కేవలం నటనే కాకుండా కొంతమంది హీరోలలో మరిన్ని కలలు దాగి ఉంటాయి. సమయం వచ్చినప్పుడు వాటిని బయటకు తీస్తుంటారు. ఇలా ఇప్పటికే చాలా మంది హీరోలు తమలో దాగి ఉన్న కలలను బయటకు తీశారు. ఇక ఇదే వరుసలో చేరేందుకు మరో హీరో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. (మైనర్‌తో లైంగిక సంబంధం.. ఒలింపిక్ విజేతపై కేసు నమోదు.. దోషిగా తేలితే..!)

కోలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతూ.. జర్నీ, రాజా రాణి సినిమాలతో తెలుగు వారికి దగ్గరైన జై మ్యూజిక్ డైరెక్టర్‌గా మారబోతున్నట్లు తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు దేవాకు దగ్గరి బంధువైన జై.. హీరోగా అవ్వకముందు కీబోర్డు ప్లేయర్‌గా పనిచేశారు. అంతేకాదు ట్రినిటీ కాలేజ్‌ ఆఫ్ లండన్ నుంచి లెవల్‌ 5 మ్యూజిక్‌ని కంప్లీట్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ హీరో ఓ సినిమాకు సంగీత దర్శకుడిగా మారబోతున్నారట. (ఇవాళ కరోనా పుట్టినరోజు.. సరిగ్గా ఏడాది క్రితం మొదటి కేసు ఎక్కడ నమోదైందంటే)

జై హీరోగా సుసీంద్రన్‌ తెరకెక్కించబోయే మూవీకి ఈ హీరోనే సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించిన ట్యూన్స్‌ కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం ఈ హీరో బ్రేకింగ్ న్యూస్‌, ఎన్ని తునిగ చిత్రాల్లో నటిస్తున్నారు. (తమిళ ‘బిగ్‌బాస్‌’లో కమల్‌ నోట శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’.. పతితులారా అంటూ అదరగొట్టిన లోకనాయకుడు)