ఆ హీరోకు చీరాల బీచ్‏లో రిసార్ట్.. అమ్మకపోయి ఉంటే ఇప్పుడు వందలకోట్ల ఆస్తి ఉండేది.. అజయ్ ఘోష్..

మొహబ్బత్ చిత్ర టీజర్ విడుదల వేడుకలో నటుడు అజయ్ ఘోష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. టాలీవుడ్ హీరో తండ్రి రామారావు రామాపురంలో రిసార్ట్స్ విక్రయించడంపై మాట్లాడారు. కొత్త చిత్ర నిర్మాతలు, దర్శకులకు విలువైన సలహాలు ఇస్తూ, సినిమా బడ్జెట్, కష్టపడి పనిచేసే తత్వం, ప్రేక్షకుల తీర్పును అంగీకరించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు.

ఆ హీరోకు చీరాల బీచ్‏లో రిసార్ట్.. అమ్మకపోయి ఉంటే ఇప్పుడు వందలకోట్ల ఆస్తి ఉండేది.. అజయ్ ఘోష్..
Ajay Ghosh

Updated on: Oct 03, 2026 | 6:47 PM

మొహబ్బత్ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం సినీ పరిశ్రమలో ఉత్సాహాన్ని నింపింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ తనదైన శైలిలో ప్రసంగించి, నూతన నిర్మాతలకు, దర్శకులకు విలువైన సలహాలు, సూచనలు అందించారు. అజయ్ ఘోష్ మాట్లాడుతూ తన బాల్య స్నేహితుడు, నటుడు నవదీప్ బాబాయి రాయణి లీలా ప్రసాద్‌ను కూడా గుర్తుచేసుకున్నారు. ఇదే సందర్భంలో నవదీప్ తండ్రి రామారావు గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. 2002లోనే చీరాల సమీపంలోని రామాపురంలో రిసార్ట్స్ నిర్మించారని, అయితే వాటిని అమ్మేయకుండా ఉండి ఉంటే, నేటికీ వందల కోట్లు విలువ చేసేవని అజయ్ ఘోష్ అన్నారు. ఈ ప్రస్తావన ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‏తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..

మొహబ్బత్ చిత్ర కథా నేపథ్యంపై మాట్లాడుతూ, తెలుగు ప్రొఫెసర్ రఫీ కుమారుడు కలాం ఈ కథను తనకు చెప్పినట్లు తెలిపారు. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే వాస్తవ సంఘటనలతో కూడుకున్న కథ అని, ప్రేమిస్తే చిత్రం తరహాలో ఉంటుందని వివరించారు. ఈ కథ తనకు బాగా నచ్చిందని, నిర్మాతలు, దర్శకులకు కూడా నచ్చడంతో తాను ఈ సినిమాలో నటించడానికి అంగీకరించానని పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..

సినిమా నిర్మాతల పట్ల అజయ్ ఘోష్ ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. నిర్మాతలు అమెరికాలో కష్టపడి సంపాదించి, తమ సొంత ఊరిలో పాఠశాలలు నిర్మించారని, సినిమాపై ఉన్న అపారమైన ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చారని చెప్పారు. వారి అభిరుచి, జిగర్ చాలా గొప్పవని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..

నవదీప్..

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..

Loading...
Unable to load recommendations.
Follow Us