Sita Ramam: సీతారామంకు ఊహించని బ్రేక్‌.. విడుదలను నిషేధించిన అక్కడి సెన్సార్‌ బోర్డ్‌..

Sita Ramam: దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం 'సీతారామం'. వైజయంతీ మూవీస్ సమర్పణలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి...

Sita Ramam: సీతారామంకు ఊహించని బ్రేక్‌.. విడుదలను నిషేధించిన అక్కడి సెన్సార్‌ బోర్డ్‌..
Sita Ramam Movie Review

Edited By:

Updated on: Aug 04, 2022 | 5:02 PM

Sita Ramam: దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబధించి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాత్రలను పరిచియం చేస్తూ విడుదల చేసిన పోస్టర్‌లు చిత్రంపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ సినిమా ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోన్న విషయం తెలిసిందే. అయితే సినిమా మరో 24 గంటల్లో విడుదల కానుందన్న సమయంలో సీతారామంకు ఊహించని షాక్‌ ఎదురైంది.

ఈ సినిమాలో మతపరమైన సన్నివేశాలున్నాయన్న కారణంతో గల్ఫ్‌ దేశాల్లో చిత్ర విడుదలకు సెన్సార్‌ నో చెప్పినట్లు తెలుస్తోంది. గల్ఫ్‌లో సినిమా విడుదలను నిషేధించినట్లు సమాచారం. అయితే చిత్ర యూనిట్‌ మాత్రం మరోసారి సెన్సార్‌ బోర్డ్‌ ముందుకు వెళ్లనుందని సమాచారం. బోర్డ్‌ సభ్యుల సూచన మేరకు అభ్యంతకర సన్నివేశాలు ఏమైనా ఉంటే తొలగించి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధంగా ఉందని టాక్‌ వినిపిస్తోంది. మరి గల్ఫ్‌లో సీతారామం విడుదలవుతుందా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ బుధవారం హైదరాబాద్‌లో ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రభాస్‌ ముఖ్య అతిథిగా హాజరై అందరినీ ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..