Prashanth Neel: ఎన్టీఆర్‌ సినిమా కోసం భారీ స్కెచ్‌ వేస్తోన్న ప్రశాంత్‌ నీల్‌.. రంగంలోకి మరో హీరో..

|

Oct 03, 2022 | 10:06 AM

కేజీఎఫ్‌ చిత్రంతో ఒక్కసారిగా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్‌. కేవలం సౌత్‌కే పరిమితమైన కన్నడ సినిమా ఇండస్ట్రీ పవర్‌ను బాలీవుడ్‌కు రుచి చూపించాడు. రెండు పార్టులుగా విడుదలైన ఈ సినిమా ఇండియాన్‌ బాక్సాఫీస్‌ ముందు...

Prashanth Neel: ఎన్టీఆర్‌ సినిమా కోసం భారీ స్కెచ్‌ వేస్తోన్న ప్రశాంత్‌ నీల్‌.. రంగంలోకి మరో హీరో..
Ntr Prashanth Neel Movie Update
Follow us on

కేజీఎఫ్‌ చిత్రంతో ఒక్కసారిగా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్‌. కేవలం సౌత్‌కే పరిమితమైన కన్నడ సినిమా ఇండస్ట్రీ పవర్‌ను బాలీవుడ్‌కు రుచి చూపించాడు. రెండు పార్టులుగా విడుదలైన ఈ సినిమా ఇండియాన్‌ బాక్సాఫీస్‌ ముందు సంచలన విజయాన్ని నమోదు చేసుకొని, రికార్డు కలెక్షన్లను రాబట్టింది. దీంతో ప్రశాంత్‌ తర్వాతి చిత్రాలపై భారీ క్రేజ్‌ ఏర్పడింది. ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా సలార్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా విడుదలవ్వకముందే ప్రశాంత్‌ నీల్‌ టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో మరో సినిమాకు కమిట్‌ అయ్యాడు. ఓ భారీ యాక్షన్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణెను తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పాన్‌ ఇండియా రేంజ్‌లో సినిమాను తెరకెక్కిస్తుండడమే ఇందుకు కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి.

 

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు మరో వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోన్న వార్తల ప్రకారం ఈ సినిమాలో మరో స్టార్‌ హీరో నటించున్నాడని తెలుస్తోంది. సినిమాలో హృరో పాత్రతో పాటు హైలెట్‌గా నిలిచే మరో పాత్ర కోసం ప్రశాంత్‌ నీల్‌ తమిళ హీరో విక్రమ్‌ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే విక్రమ్‌ కూడా ఈ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన ఒక్కే బ్యాలెన్స్‌ ఉందని ఇండస్ట్రీ టాక్‌. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..