Allu Arjun: అల్లు అర్జునా మజాకా.. బన్నీతో సినిమా చేయడానికి సిద్ధమైన హాలీవుడ్ డైరెక్టర్..

|

Aug 26, 2022 | 3:24 PM

Allu Arjun: పుష్ప.. ఈ ఒక్క సినిమా దేశాన్ని కుదిపేసింది. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. బన్నీ నటనకు యావత్‌ దేశం ఫిదా అయ్యింది. అప్పటి వరకు స్టైలిష్‌ లుక్స్‌లో ప్రేక్షకులను మెప్పించిన అల్లు అర్జున్‌ తొలిసారి డీగ్లామర్‌ పాత్రలో నటించి అభిమానులను...

Allu Arjun: అల్లు అర్జునా మజాకా.. బన్నీతో సినిమా చేయడానికి సిద్ధమైన హాలీవుడ్ డైరెక్టర్..
Allu Arjun
Follow us on

Allu Arjun: పుష్ప.. ఈ ఒక్క సినిమా దేశాన్ని కుదిపేసింది. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. బన్నీ నటనకు యావత్‌ దేశం ఫిదా అయ్యింది. అప్పటి వరకు స్టైలిష్‌ లుక్స్‌లో ప్రేక్షకులను మెప్పించిన అల్లు అర్జున్‌ తొలిసారి డీగ్లామర్‌ పాత్రలో నటించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఎర్ర చందనం స్మగ్లర్‌ పాత్రలో తనదైన మేనరిజంతో దేశాన్ని ఓ ఊపు ఊపేశారు. పుష్పలో బన్నీ చెప్పిన డైలాగ్‌లు ఎంతటి సంచనలం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో అల్లు అర్జున్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్.

ఇదిలా ఉంటే బన్నీ రేంజ్‌ బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాలేదు, హాలీవుడ్‌ వరకు వ్యాపించింది. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్‌ ఏకంగా హాలీవుడ్‌ సినిమాలో నటించే చాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాలో బన్నీ నటనకు ఫిదా అయిన ఓ ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు అతనితో సినిమా చేయాలని ఫిక్స్‌ అయ్యాడని సమాచారం. ఇందులో భాగంగా ఇటీవల న్యూయార్క్‌ వెళ్లిన అల్లు అర్జున్‌ను సదరు దర్శకుడు ప్రత్యేకంగా కలిశాడని, ఈ సమయంలో హాలీవుడ్‌ చిత్రంపై చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. సదరు దర్శకుడు తెరకెక్కించే సినిమాలో బన్నీ కోసం పవర్‌ ఫుల్‌ పాత్రను క్రియేట్ చేశాడని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉంది.? అల్లు అర్జున్‌ హాలీవుడ్‌ ఎంట్రీ ఎప్పుడనే దానిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే బన్నీ ప్రస్తుతం పుష్ప సీక్వెల్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే అధికారికంగా షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా రెగ్యుల్‌ చిత్రీకరణను వచ్చే నెల నుంచి స్టార్ట్ చేయడానికి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బన్నీ ఇప్పటి వరకు తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..