Sreeleela: శ్రీలీల సుడి మాములుగా లేదుగా… ఏకంగా ఆ హీరో సరసన నటించే ఛాన్స్‌?

రవితేజ హీరోగా నటించిన ధమాక సినిమాతో మొదలైన శ్రీలీలా సినిమా ఆఫర్స్‌ కొనసాగుతూనే ఉన్నాయి. స్కంధ, భగవంత్‌ కేసరి, ఆదికేశవ వంటి చిత్రాల్లో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. ఇక మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన 'గుంటూరు కారం', పవన్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'ఉస్తాద్‌ భగవత్‌ సింగ్‌' సినిమాల్లో నటించే అవకాశం కొట్టేసిన శ్రీలీలా టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌గా...

Sreeleela: శ్రీలీల సుడి మాములుగా లేదుగా... ఏకంగా ఆ హీరో సరసన నటించే ఛాన్స్‌?
Sreeleela

Updated on: Sep 25, 2023 | 6:49 PM

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార శ్రీలీల. తొలి చిత్రంతోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ చిన్నది. అనతి కాలంలోనే అగ్ర కథా నాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకుందీ బ్యూటీ. ఈ అమ్మడి క్రేజ్‌కు తగ్గుట్లుగానే ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

రవితేజ హీరోగా నటించిన ధమాక సినిమాతో మొదలైన శ్రీలీలా సినిమా ఆఫర్స్‌ కొనసాగుతూనే ఉన్నాయి. స్కంధ, భగవంత్‌ కేసరి, ఆదికేశవ వంటి చిత్రాల్లో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. ఇక మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’, పవన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్‌ భగవత్‌ సింగ్‌’ సినిమాల్లో నటించే అవకాశం కొట్టేసిన శ్రీలీలా టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుందీ చిన్నది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ చిన్నది మరో భారీ అవకాశాన్ని కొట్టేసినట్లు తెలుస్తోంది.

ఈ చిన్నది ఏకంగా ప్రభాస్‌ సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. సీతారామం సినిమాతో యావత్‌ ఇండియాను తనవైపు తిప్పుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా ఓ బాలీవుడ్‌ బ్యూటీ నటించనున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ గోల్డెన్‌ ఛాన్స్‌ను యంగ్‌ బ్యూటీ శ్రీలీలా కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు నెట్టింట ఇదే చర్చ నడుస్తోంది.

ఇప్పటికే దర్శకుడు అటు ప్రభాస్‌తో పాటు ఇటు శ్రీలీలకు కథ వినిపించగా ఇద్దరూ ఓకే చెప్పారని సమాచార. ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమా రానున్నట్లు సమాచారం. డిసెంబర్‌ నెల నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రభాస్‌ పుట్టిన రోజైన అక్టోబర్ 23వ తేదీన చిత్ర యూనిట్‌ తెలియజేయనుందని, అందుకోసం సన్నాహాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ప్రభాస్‌ ప్రస్తుతం సలార్‌, కల్కి 2898 ఏడీ, స్పిరిట్‌తో పాటు మారుతి డైరెక్షన్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌ తాజాగా హను మూవీకి కూడా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కాగా శ్రీలీల స్కంద మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..