Nayanthara: చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘లూసిఫర్’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో మోహన్‌లాల్ పాత్రలో చిరు కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరో పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో చెల్లి పాత్రకు కూడా అదే స్థాయిలో ఉంటుంది. మలయాళంలో ఈ పాత్రలో మంజు వారియర్ కనిపించగా.. తెలుగులో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనున్నారు. ఇదిలా ఉంటే ఈ క్యారెక్టర్‌కు భర్త పాత్రలో కనిపించే వివేక్ ఒబెరాయ్ పాత్రను తెలుగులో సత్యదేవ్ పోషిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం చర్చకు దారి తీసింది.
ఇంతకీ విషయమేంటే.. తనకు జోడిగా సత్యదేవ్ నటించడంపై నయనతార అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. తన పక్కన పాపులారిటీ ఉన్న హీరోను కాకుండా యువ కథానాయకుడిని తీసుకోవడంపై నయనతార స్పందిస్తూ.. ‘తనకు జోడీగా నటించేంత పాపులారిటీ ఆయనకు లేదు కదా’ అని స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సత్యదేవ్‌ను మార్చడం కుదరదని, చిరంజీవి తర్వాత అనుకున్న పాత్ర సత్యదేవ్‌దేనని దర్శకుడు మోహన్‌రాజా తెలిపినట్లు సమాచారం. సత్యేదేవ్ తొలి నుంచి విభిన్న పాత్రల్లో నటిస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారని చిత్ర యూనిట్ నయన్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని టాక్ నడుస్తోంది. మరి నయనతార నిజంగానే ఇలా మాట్లాడిందా.. లేదా మధ్యలో ఎవరైనా అట్టు కథ అల్లారో తెలియాలి.
Also Read: Viral Photo: ఈ ఫోటోలోని టీనేజర్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు.. ఎవరో గుర్తుపట్టారా..?
Konijeti Rosaiah: బడ్జెట్ కూర్పులో ఘనాపాటి.. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య రాజకీయ ప్రస్థానం..!
Akhanda : నటసింహం “అఖండ” డిజిటల్ రైట్స్ దక్కించుకుంది ఎవరో తెలుసా..